MLA Quota MLCs: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ పూర్తి ఫోకస్ పెట్టింది. ఈరోజు లేదా రేపటికల్లా అభ్యర్థుల పేర్లను ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ పెద్దలు ఖరారు చేస్తారని తెలుస్తోంది. వారంతా సోమవారం రోజు నామినేషన్లను దాఖలు చేస్తారు. అదే రోజుతో నామినేషన్ల దాఖలు గడువు కూడా ముగియనుంది.
Also Read :International Womens Day 2025 : అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకోవాలి?
సీఎం రేవంత్ కీలక సూచన
తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలను ఈసారి భర్తీ చేస్తున్నారు. వీటిలో నాలుగు స్థానాలు కాంగ్రెస్‌కు దక్కనున్నాయి. ఇందులో ఒకటి సీపీఐకి ఇచ్చేందుకు హస్తం పార్టీ రెడీ అయింది. మిగతా మూడు స్థానాల్లో ఒకటి కాంగ్రెస్‌కు చెందిన ఎస్టీ వర్గం నేతకు ఇస్తారట. ఎస్టీ వర్గానికి చెందిన మహిళా నేతను ఎమ్మెల్సీ చేయాలని సీఎం రేవంత్ సూచించినట్లు తెలిసింది. ఇక మిగిలిన 2 ఎమ్మెల్సీ స్థానాల కోసం ఎస్సీ, ఓసీ వర్గాల నేతలు పోటీపడుతున్నారు. గతంలో భర్తీ చేసిన రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి బీసీకి ఇచ్చారు. ఇంతకుముందు భర్తీ చేసిన రెండు రాజ్యసభ ఎంపీ స్థానాల్లో ఒకటి బీసీలకు ఇచ్చారు. అందుకే ఈసారి బీసీ నేతలకు అవకాశం ఇవ్వకపోవచ్చని అంటున్నారు. దీంతో 2 ఎమ్మెల్సీ స్థానాల కోసం ప్రస్తుతం ఎస్సీ, ఓసీ వర్గాల నేతల పేర్లను మాత్రమే పరిశీలిస్తున్నారట.
Also Read :Women’s Day : నేడు ఇందిరా మహిళా శక్తి మిషన్ ఆవిష్కరణ..మహిళలకు వరాల జల్లు
నేడు ఢిల్లీకి..
సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఢిల్లీకి వెళ్లనున్నారు. వారు కాంగ్రెస్ పెద్దలు కేసీ వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్‌లతో ఆదివారం ఉదయం భేటీ అవుతారు. వారి ఆమోదంతో, ఆదివారం మధ్యాహ్నంకల్లా ఎమ్మెల్సీ అభ్యర్థుల(MLA Quota MLCs) పేర్లను ఫైనలైజ్ చేస్తారు. సోమవారం రోజు ఆయా అభ్యర్థులంతా నామినేషన్లను దాఖలు చేస్తారు.