BRS : కాంగ్రెస్ లోకి వాళ్లను పంపించింది తానే అంటూ మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు

పార్టీ మారిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లను తానే కాంగ్రెస్ లోకి పంపించానని అన్నారు. వాళ్లంతా తన మనుషులేనని...తన కోవర్టులేనని చెప్పారు.

  • Written By:
  • Publish Date - May 6, 2024 / 05:54 PM IST

అసెంబ్లీ ఎన్నికల ముందు నుండి కూడా కాంగ్రెస్ లోకి పెద్ద ఎత్తున నేతలు చేరుతున్న సంగతి తెలిసిందే. ఇక లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కూడా అలాగే జరుగుతుంది. ముఖ్యంగా బిఆర్ఎస్ నుండి కీలక నేతలు , మాజీ ఎమ్మెల్యేలు , మాజీ మంత్రులే కాదు గెలిచిన ఎమ్మెల్యేలు సైతం పలువురు కాంగ్రెస్ లో చేరారు. ఇలా వరుసపెట్టి నేతలు చేరుతుండడంతో అందరిలో అనేక అనుమానాలు మొదలవుతున్నాయి. నిజంగా వీరే చేస్తున్నారా..లేక బిఆర్ఎస్ ప్లాన్ చేసి ఇలా చేరేలా చేస్తుందా..? అని అంత అనుకుంటున్న వేళ..తాజాగా బిఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

బోయిన్ పల్లిలో కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత, మల్కాజిగిరి ఎంపీ అభ్యర్ధి రాగిడి లక్ష్మారెడ్డితో కలిసి నిర్వహించిన సమావేశంలో మల్లారెడ్డి మాట్లాడుతూ..మేడ్చల్ జిల్లా లో పార్టీ మారిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లను తానే కాంగ్రెస్ లోకి పంపించానని అన్నారు. వాళ్లంతా తన మనుషులేనని…తన కోవర్టులేనని చెప్పారు. వాళ్ళంతా కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ బీఆర్ఎస్ కోసమే పనిచేస్తారని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత వారంతా బీఆర్ఎస్ లో చేరతారన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేసారు. మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపును ఎవరు అడ్డుకోలేరన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే లక్ష్మారెడ్డిని గెలిపిస్తాయన్నారు.

Read Also : AP Poll : వైసీపీ నేతలకు నిద్ర లేకుండా చేస్తున్న సర్వేలు..