T Congress : కాంగ్రెస్ లోకి మరో ఇద్దరు బిఆర్ఎస్ నేతలు

గ్రేటర్ పరిధిలో ముగ్గురు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ప్రకాష్‌ గౌడ్, అరికపూడి గాంధీ లు కాంగ్రెస్ లో ఇప్పటికే చేరగా..ఇప్పుడు మహిపాల్ చేరిక తో ఆ సంఖ్య నాల్గు కు చేరింది. కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, కాలె యాదయ్య, సంజయ్ కుమార్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి లు మిగతా నియోజకవర్గాల నుండి కాంగ్రెస్ లో చేరారు.

Published By: HashtagU Telugu Desk
Mahipal Joins Cng

Mahipal Joins Cng

కాంగ్రెస్ లోకి బిఆర్ఎస్ (BRS) పార్టీల నేతల వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అగ్ర నేతల దగ్గరి నుండి కిందిస్థాయి నేతల వరకు వరుసగా కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. సోమవారం సాయంత్రం పఠాన్‌చెరు బిఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి (MLA Gudem Mahipal Reddy) కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈయన తో పాటు జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ సైతం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మహిపాల్‌రెడ్డి చేరిక తో ఇప్పటివరకు కాంగ్రెస్ లో చేరిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 10 కి చేరింది.

We’re now on WhatsApp. Click to Join.

మరికొంతమంది లైన్లో ఉన్నట్లు తెలుస్తుంది. వాస్తవానికి శనివారం సాయంత్రం మంత్రి పొంగులేటి తో కలిసి మహిపాల్ సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఆ రోజే మహిపాల్ కాంగ్రెస్ లో చేరతారని అంత భావించారు. కానీ ఆయన ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మహిపాల్ , అలాగే గాలి అనిల్ కుమార్ లు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇటీవల మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. మైనింగ్‌లో అక్రమాలకు పాల్పడినట్లు మహిపాల్ రెడ్డి సోదరులపై ఆరోపణలు రావడం తో ఈడీ సోదాలు జరిపింది. ఈడీ విచారణ కు సైతం మహిపాల్ రెడ్డి హాజరయ్యారు.

ఇదిలా ఉంటె అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ తరుపున గెలిచినా వారంతా ఇప్పుడు కాంగ్రెస్ గూటికి వస్తున్నారు. గ్రేటర్ పరిధిలో ముగ్గురు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ప్రకాష్‌ గౌడ్, అరికపూడి గాంధీ లు కాంగ్రెస్ లో ఇప్పటికే చేరగా..ఇప్పుడు మహిపాల్ చేరిక తో ఆ సంఖ్య నాల్గు కు చేరింది. కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, కాలె యాదయ్య, సంజయ్ కుమార్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి లు మిగతా నియోజకవర్గాల నుండి కాంగ్రెస్ లో చేరారు.

Read Also : Hemant Soren : సీఎం సోరెన్ ట్విస్ట్.. ప్రధాని మోడీతో భేటీ

  Last Updated: 15 Jul 2024, 08:06 PM IST