Site icon HashtagU Telugu

Reddy Corporation : తెలంగాణలో రెడ్డి కార్పొరేష‌న్

KTR

KTR

టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్డి సామాజికవర్గం అగ్రస్థానంలో ఉందని, అందులో పేదలు కూడా ఉన్నారని అభిప్రాయపడ్డారు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుపై వీలైనంత త్వరగా సీఎం కేసీఆర్‌తో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రెడ్డి సంఘం ప్రమాణ స్వీకారోత్సవంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగిస్తూ ప్రతి కులంలో పేదలు ఉన్నారని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ నాయకత్వంలో కులమతాలకు అతీతంగా పేదలందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో రాష్ట్రాభివృద్ధి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాతే సాధ్యమైందన్నారు. రైతుగా కేసీఆర్‌కు ప్రజల సమస్యలు తెలుసని, రైతుల సంక్షేమం కోసం పాటుపడుతున్నారని పేర్కొన్నారు. రైతుబంధు పెట్టుబడి సాయాన్ని ఈ నెల 28న అందజేస్తామని, సిరిసిల్లలో ప్రభుత్వ వైద్య కళాశాలను ఆమోదించినట్లు మంత్రి తెలిపారు.