సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత (BRS MLA Lasya Nanditha)..శుక్రవారం ఉదయం పటాన్‌చెరూ సమీపంలోని ఓఆర్‌ఆర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదం (Road Acccident)లో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఓఆర్‌ఆర్‌పై ఆమె ప్రయాణిస్తున్న కారు (CAR) అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమె ఘటనా స్థలంలోనే మరణించారు. కొద్దీ సేపటి క్రితం గాంధీ హాస్పటల్ లో పోస్టుమార్టం పూర్తి అయ్యింది.
కాగా లాస్య నందిత అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి శాంతి కుమారికి ఆదేశాలు జారీ చేశారు. మరికాసేపట్లో కార్ఖానాలోని నివాసానికి లాస్య నందిత పార్థివదేహాన్ని తరలించనున్నారు. సాయంత్రం మారేడుపల్లిలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆమె తండ్రి, మాజీ ఎమ్మెల్యే సాయన్న సమాధి పక్కనే లాస్య అంత్యక్రియలు జరపాలని కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. గతేడాది ఫిబ్రవరి 19న సాయన్న మరణించగా.. సరిగ్గా ఏడాది తర్వాత ఆయన సమాధి పక్కనే కూతురి అంత్యక్రియలు జరగనుండటం విషాదకరం.
We’re now on WhatsApp. Click to Join.
ఇక లాస్యను పలుమార్లు మృతువు వెంటాడినట్లు తెలుస్తుంది. 2023 DECలో లాస్య లిఫ్టులో ఇరుక్కొని దాదాపు 3 గంటల పాటు అందులోనే ఉండిపోయారు. ఈ ఏడాది ఫిబ్రవరి 13న నల్గొండ సభ నుంచి తిరిగి వస్తుండగా ఆమె స్కార్పియో కారు ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నందితకు స్వల్ప గాయాలయ్యాయి. రోజు హైదరాబాద్ ORRపై కారు ప్రమాదంలో నందిత మరణించారు.
ఈ ప్రమాదం ఫై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న పీఏ/డ్రైవర్ ఆకాశ్ స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. అతడిని ఏది అడిగినా.. తనకేం గుర్తులేదంటున్నాడు. అయితే డ్రైవర్ నిద్రమత్తు, అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు సమాచారం.
Read Also : Prince Yawar Nayani Pawani Love : ప్రిన్స్ యావర్ తో లవ్.. నయని పావని ఏమంటుంది అంటే..?