Site icon HashtagU Telugu

Lasya Nanditha : లాస్య పాడె మోసిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు

Mla Lasya Nanditha Last Jou

Mla Lasya Nanditha Last Jou

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లాస్య నందిత (BRS MLA Lasya Nanditha)..శుక్రవారం ఉదయం పటాన్‌చెరూ సమీపంలోని ఓఆర్‌ఆర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదం (Road Acccident)లో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఓఆర్‌ఆర్‌పై ఆమె ప్రయాణిస్తున్న కారు (CAR) అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమె ఘటనా స్థలంలోనే మరణించారు. పోస్టుమార్టం అనంతరం కార్ఖానాలోని నివాసానికి లాస్య నందిత పార్థివదేహాన్ని తీసుకొచ్చారు. సాయంత్రం అంతిమయాత్ర ప్రారంభం కాగా.. మాజీ మంత్రి హరీష్ రావు , ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి లు నందిత పాడె మోశారు. కొద్దీ సేపటి క్రితం లాస్య అంత్య క్రియలు ప్రభుత్వ లాంఛనాల నడుమ పూర్తి అయ్యాయి. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బిఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. అంతకు ముందు లాస్య నందిత భౌతిక‌కాయానికి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నివాళుల‌ర్పించారు. నందిత కుటుంబ స‌భ్యుల‌ను సీఎం ప‌రామ‌ర్శించారు. సీఎంతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్ర‌భాక‌ర్, శ్రీధ‌ర్‌బాబుతో పాటు ప‌లువురు నివాళుల‌ర్పించారు. ఇక లాస్య నందిత కారు డ్రైవ‌ర్ ఆకాశ్‌పై కేసు న‌మోదు చేసిన‌ట్లు సంగారెడ్డి జిల్లా పోలీసులు తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

సదాశివపేటలోని దర్గాకు వెళ్లేందుకు ఎమ్మెల్యే లాస్య నందిత త‌న ఇంటి నుంచి శుక్ర‌వారం తెల్ల‌వారుజామున బ‌య‌ల్దేరారు. తెల్లవారుజామున 4:58 గంట‌ల‌ సమయంలో శామీర్‌పేట టోల్ ప్లాజా వద్ద ఔట‌ర్ రింగ్ రోడ్డుపైకి ప్రవేశించారు. సుల్తాన్‌పూర్ ఎగ్జిట్ సమీపంలో ఉద‌యం 5:30 గంట‌ల స‌మ‌యంలో ముందు వెళ్తున్న వాహ‌నాన్ని ఎమ్మెల్యే కారు ఢీకొట్టింది. దీంతో కారు అదుపుత‌ప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టింది. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో లాస్య నందిత బ‌తికే ఉన్నారు. ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా ప్రాణాలు కోల్పోయారని , పీఏ ఆకాశ్ ఎడ‌మ‌కాలు విరిగిందని , ప్రస్తుతం అతడికి శ్రీక‌ర ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారని ఏఎస్పీ సంజీవ రావు తెలిపారు.

Read Also : Medaram: మేడారం జాతరకు పోటెత్తిన భక్తులు, అలాంటివాళ్లకు ప్రత్యేక ఏర్పాట్లు