Site icon HashtagU Telugu

Komatireddy Rajagopal Reddy : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇలా అన్నారేంటి..?

Rajagopal Kcr

Rajagopal Kcr

కోమటిరెడ్డి బ్రదర్స్ (Komatireddy Brothers) నిత్యం వార్తల్లో నిలుస్తుంటారనే సంగతి తెలిసిందే. గతంలో ప్రతిపక్షం లో ఉన్న, ఇప్పుడు అధికారంలో ఉన్న సరే..వారు ఏ స్థానాల్లో ఉన్న సరే, కీలక వ్యాఖ్యలు చేస్తూ హైలైట్ అవ్వడం కామన్. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీ పై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు , ఆరోపణలు చేయడం కామన్. అధికార పార్టీ మంచి చేసిన , చెడు చేసిన విమర్శలు చేయడం అనేది జరుగుతుంటుంది. కానీ అధికార పార్టీ నేతలే..తమ సొంత పార్టీపై విమర్శలు చేయడం అనేది షాక్ కు గురి చేస్తుంటుంది. తాజాగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ అయ్యాయి.

ఆదివారం తన ప్రసంగంలో కొన్ని వ్యాఖ్యల్ని ప్రతిపక్ష బీఆర్ఎస్.. సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేస్తోంది. చౌటుప్పల్ మండలంలోని మాశీదుగూడెం గ్రామంలో జరిగిన ప్రజాపాలన సభలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమకు రైతు రుణమాఫీ కాలేదని, రైతుబంధు రాలేదని జనాలు తిరుడున్నారని వాపోయారు. అంతా కేసీఆర్‌ పాలనే బాగుండే అంటూ ఇంకా మెచ్చుకుంటున్నారని చెప్పారు. అయితే మాఫీ కాలేదని, రైతుబంధు రాలేదని జనాలు తిడుతున్నారు. అదే రూ.2 లక్షల రుణ మాఫీ అయినోల్లు మాత్రం జేబులో వేసుకొని సప్పుడు చేస్తలేరుని చెప్పారు. అలాగే ప్రభుత్వానికి అనుకూలంగా చాలా మాటలు మాట్లాడారు. వాటిలో కొన్ని మాటలు మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రుణమాఫీ వంటి కీలక పథకాలపై రాజగోపాల్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ వ్యాఖ్యలను బిఆర్ఎస్ తమకు అనుకూలంగా ప్రచారం చేస్తుంటుంది.

ఇంతకీ రాజగోపాల్ ఏమన్నారంటే…

రుణమాఫీపై:

రుణమాఫీ అంశంపై కూడా ఆయన సెటైర్లు వేశారు. “రుణమాఫీ కాలేదని, రైతుబంధు రాలేదని జనాలు ఫుల్లుగా తిడుతున్నారు. 2 లక్షల రుణమాఫీ అయినవాళ్లు మాత్రం జేబులో వేసుకొని సైలెంటుగా ఉన్నారు” అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

రైతు భరోసాపై:

“అధికారంలోకి వచ్చాక ఒకసారి రైతు బంధు ఇచ్చాం. దాన్ని కొనసాగించలేదు. దాని బదులు రైతు భరోసా తెచ్చాం. కానీ దాన్ని గతేడాది ఇవ్వలేదు. దాంతో ప్రజలు కేసీఆర్ పాలనే బాగుండేదని గ్రామాల్లో అంటున్నారు” అని కోమటిరెడ్డి అన్న మాటలు.. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి.

ఇందిరమ్మ ఆత్మీయ భరోసాపై:

ఇందిరమ్మ ఆత్మీయ భరోసాపై కూడా కోమటిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. “365 రోజుల్లో 20 రోజులు ఉపాధి హామీ చేసిన వారికి ఆత్మీయ భరోసా ఇస్తారట.. ఏ లెక్కన ఇస్తున్నారో నాకు అర్థం కావట్లేదు ” అని అన్నారు.

ఇలా సొంత పార్టీ నేతే.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. అది కూడా ప్రాజాపాలన సదస్సులో ఈ వ్యాఖ్యలు చెయ్యడం కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందిగా మారింది. ఐతే.. తనకు మంత్రి పదవి ఇవ్వలేదనే ఉద్దేశంతోనే రాజగోపాల్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారనీ.. ప్రజల్లో పార్టీ పట్ల ఉన్న సానుకూల ఉద్దేశాన్ని దూరం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.