Site icon HashtagU Telugu

Dammapeta : అలిగిన ఎమ్మెల్యే జారె.. సమాచారం ఇవ్వకుండానే అభివృద్ధి పనులకు శ్రీకారం

Jaare Fire

Jaare Fire

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల నేపథ్యంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ (Jare Adinarayana) తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao), ఎమ్మెల్యే జారెతో కలిసి పూసుకుంట, కట్కూరు గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. షెడ్యూల్ ప్రకారం మూడు హై లెవెల్ బ్రిడ్జిల ప్రారంభోత్సవంతో పాటు పూసుకుంటలో ఆయిల్ ఫామ్ మొక్కలు, తేనెటీగల పెట్టెల పంపిణీ చేయనున్నట్లు ముందే ప్రకటించారు.

Smita Sabharwal : భగవద్గీత శ్లోకంతో స్మితా సభర్వాల్ సంచలన ట్వీట్

అయితే షెడ్యూల్‌లో లేని విధంగా, ఆర్ అండ్ బి శాఖ అధికారులు రూ.15 కోట్ల వ్యయంతో 10 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం గురించి స్థానిక ఎమ్మెల్యేకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం ఆయనలో తీవ్ర అసహనాన్ని రేకెత్తించింది. తనకు తెలియకుండానే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంతో ఆర్ అండ్ బి అధికారులపై జారె తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఉన్నాడనుకున్నారా.. లేదా చచ్చిపోయాడని అనుకుంటున్నారా..? ఎమ్మెల్యే పిచ్చోడిలా కనిపిస్తున్నాడా..? నా నియోజకవర్గంలో నాకు తెలియకుండానే అభివృద్ధి పనులను ఎలా ప్రారంభిస్తారని అధికారులు తీరుని తప్పుబట్టారు. మంత్రి తుమ్మల అంటే తనకి గౌరవం ఉందని.. కానీ అధికారుల తనని అవమానించేలా వ్యవహరించడంతో తన మనోభావం దెబ్బతిందన్నారు.

Minister Ponguleti : చట్టం పేద ప్రజలకు చుట్టంలా ఉండాలనే భూభారతి : మంత్రి పొంగులేటి

ఈ కార్యక్రమంలో ప్రారంభోత్సవంలో తాను పాల్గొననని.. పర్యటన నుండి తిరిగి వెళ్లిపోతానని ఎమ్మెల్యే జారె తెగేసి చెప్పారు. మంత్రి తుమ్మల కలుగజేసుకొని అధికారులు ఎమ్మెల్యేకి సమాచారం అందించకపోవడం అధికారుల తప్పేనని.. దీనిపై తర్వాత చర్చిద్దామని జారె ను సముదాయించారు. జారెను మంత్రి తుమ్మల తన కారులో కూర్చోబెట్టుకుని తీసుకువెళ్లారు. దీంతో రోడ్డు నిర్మాణ పనుల శంకుస్థాపనకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించకుండానే పర్యటన ముందుకు సాగింది. దీంతో రూ.15 కోట్ల రూపాయల రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభోత్సవానికి నోచుకోలేదు.