TS : టీ కాంగ్రెస్ పై ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్..ఇది పద్దతి కాదంటూ..!!

  • Written By:
  • Publish Date - November 19, 2022 / 11:00 AM IST

తెలంగాణ కాంగ్రెస్ లో విభేదాలు కొత్తేమీ కావు. పార్టీ నేతల మధ్య సమన్వయం లోపంతో ఎప్పుడూ ఎదోక రచ్చ జరుగుతూనే ఉంటుంది. ఏ నాయకుడు ఎలా స్పందిస్తారో అర్థం కాదు. తాజాగా మరోసారి విభేదాలు వెలుగుచూశాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ భవష్యత్తు కార్యచరణను రూపొందించేందుకు పార్టీ హైకమాండ్ ఇవాళ సాయంత్రం జూమ్ సమావేశం ఏర్పాటు చేసింది. దీనిపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. సమావేశం నిర్వహించే పద్దతి ఇది కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరుగా సమావేశం ఏర్పాటు చేయాలని…కానీ జూమ్ మీటింగ్ ఏంటీ అంటూ ప్రశ్నించారు. జూమ్ మీటింగ్ కోసం ఓ నేత జగ్గారెడ్డికి ఫోన్ చేయడంతో ఆయన కోపంతో రగిలిపోయినట్లు తెలుస్తోంది. రాహుల్ పాదయాత్ర, రాష్ట్రంలో రాజకీయాలపై నేరుగా కూర్చుండి మాట్లాడే సమయం కూడా నేతలకు లేకుండా పోయిందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పార్టీ నడిపే పద్దతి ఇది కాదంటూ అసహన చేశారని సమాచారం. బీజేపీ, టీఆర్ఎస్ దూకుడుగా రాజకీయాలు చేస్తుంటూ…మీరు జూమ్ మీటింగ్ ఏర్పాటు చేడయం ఏంటంటూ ప్రశ్నించారు. జూమ్ మీటింగ్ తో ఏం ఉయోగమో చెప్పాలంటూ ప్రశ్నించారు. ప్రజాసమస్యలపై పోరాడాలని శుక్రవారం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే. శనివారం జూమ్ మీటింగ్ ఉంటుందన్నారు. నేతలంతా హాజరు కావాలని చెప్పారు. కార్యాచరణ ప్రకటిస్తామన్నారు రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.