Site icon HashtagU Telugu

MLA Jagga reddy : మంత్రిపై ఊహించ‌ని వ్యాఖ్య‌లు చేసిన జ‌గ్గారెడ్డి.

Congress to BRS

Jaggareddy 1

ఢిల్లీలో రాహుల్ మీటింగ్ త‌ర్వాత పార్టీలో కాస్త యాక్టివ్ అయిన‌ట్టే కనిపిస్తున్నారు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి. అధికార పార్టీపై విమ‌ర్శ‌ల‌తో రెచ్చిపోతున్నారు. తాజాగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పువ్వాడ ఒక సైకో అని అభివర్ణించారు. అతడిని వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మూడేళ్లుగా ఖమ్మంలో పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయని, పువ్వాడకు కొందరు పోలీసులు గులాంగిరీ చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్ లను ఆకట్టుకునేందుకు పువ్వాడ అతిగా ప్రవర్తిస్తున్నారని జగ్గారెడ్డి విమర్శించారు.

ఖమ్మంలో బీజేపీ కార్యకర్త సాయిగణేశ్ ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. ఈ ఆత్మహత్యకు కారకుడు పువ్వాడేనంటూ బీజేపీ నేతలు మండిపడుతున్నారు.ఈ అంశంపై జగ్గారెడ్డి స్పందిస్తూ, సాయిగణేశ్ నుంచి పోలీసులు ఎందుకు వాంగ్మూలం తీసుకోలేదో చెప్పాలని నిలదీశారు. కావాలనే పోలీసులు వాంగ్మూలం తీసుకోలేదని అర్థమవుతోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైనా మంత్రి పువ్వాడ ఇదే తరహాలో వేధింపులకు పాల్పడ్డారని జగ్గారెడ్డి పేర్కొన్నారు.