Site icon HashtagU Telugu

MLA Jagga Reddy: ప్రజల్లో జగ్గారెడ్డి ఫాలోయింగ్ చూసి ఆశ్చర్యపోయిన రాహుల్ గాంధీ

Jagga Reddy

Jagga Reddy

MLA Jagga Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను అన్నీ ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈసారి గెలుపు కత్తి మీద సాములా మారడంతో అగ్రనేతలు, జాతీయ నాయకులు సైతం రాష్ట్రంలో తమ పార్టీ అభ్యర్ధుల్ని కాపాడుకునేందుకు ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల హీట్ పీక్స్ కు చేరింది. రాష్ట్రంలో ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య రసవత్తర పోరు కనబడుతుంది. అధికారం కాపాడుకునే క్రమంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు గుప్పిస్తుంటే, తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ఎన్నికలకు సిద్దమవుతుంది. మరోవైపు బీజేపీ సీన్ రివర్స్ మోడ్ లో సాగుతుంది. మొన్నటివరకు రాష్ట్రంలో కీలకంగా వ్యవహరించిన కమలం ఒక్కసారిగా ఢీలా పడింది. దీంతో ప్రజలు బీజేపీని నమ్మే పరిస్థితి కనిపించడం లేదు.

తెలంగాణలో కాంగ్రెస్ గాలి వీస్తుంది. గ్రామ స్థాయిలో కాంగ్రెస్ చాపకింద నీరులా విస్తరిస్తుంది. ప్రజల్లోకి వెళ్తూ బీఆర్ఎస్ వైఫల్యాలను ఎంగడుతున్నారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడంలో కాంగ్రెస్ సఫలం అయింది. ఎన్నికలు మరో మూడు రోజుల్లో జరగనుండటంతో ఢిల్లీ పెద్దలు తెలంగాణలో పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రాహుల్ గాంధీ సంగారెడ్డి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీపై స్థానిక ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డిపై తన వ్యక్తిగత అభిమానాన్ని చాటుకున్నారు. గతంలో ఇందిరా గాంధీ కూడా మెదక్ ఎంపీ గా పోటీ చేశారని జగ్గారెడ్డి గుర్తు చేశారు. అయితే ఇప్పుడు ఇందిరా గాంధీ గారి మనవడు రాహుల్ గాంధి అదే గంజి మైదాన్ లో మాట్లాడటం చాలా ఆనందంగా ఉందన్నారు. అందులో భాగంగా జగ్గారెడ్డి కి ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి రాహుల్ గాంధీ సైతం ఆశ్చర్య పోయారు. అతను చెప్పిన పాము ముంగిస కథ  వింటూనే తెలంగాణ కా షేర్ అంటూ ప్రశంసలతో ముంచెత్తారు

జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ఏళ్లకు ఒకసారి వచ్చే బీఆర్ఎస్ కావాలా ఎదురుపడ్డప్పుడల్లా ఆప్యాయంగా పలకరించే నేను కావాలో తేల్చుకోండని ఓటర్లకు చెప్పారు జగ్గారెడ్డి. ఇక జగ్గారెడ్డి ప్రసంగిస్తుండగా స్థానిక ప్రజలు సభాప్రాంగణాన్ని హోరెత్తించారు. ప్రజల్లో జగ్గారెడ్డి ఫాలోయింగ్ చూసి రాహుల్ గాంధీ ఆశ్చర్యపోయారు.

తెలంగాణలో ఎన్నికల ప్రచారం రోజురోజుకి హీట్ పుట్టిస్తున్న నేపథ్యంలో ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు సర్వేలు చెప్తున్నాయి. కాంగ్రెస్ ప్రకటించిన మానిఫెస్టో, గ్యారెంటీ స్కీమ్ లకు ప్రజలు ఆకర్షితులైనట్లుగా సర్వేల ఆధారంగా స్పష్టమవుతుంది.

Also Read: Puja Room Decoration : ఇంట్లో పూజగది డెకొరేషన్‌కు టిప్స్ ఇవీ..