Site icon HashtagU Telugu

Jagga Reddy : జగ్గారెడ్డి కూడా సీఎం అవుతానని ప్రకటన

Jaggareddy Cm

Jaggareddy Cm

ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్లు ఉంది తెలంగాణ కాంగ్రెస్ (Congress) సీనియర్ నేతలు తీరు. ఇంకా ఎన్నికల్లో నిలిచే అభ్యర్థుల ప్రకటన పూర్తిగా జరగలేదు..ఎన్నికలు రానేలేదు..విజయం సాధించిందే లేదు అప్పుడే సీఎం రేస్ లో నేనున్నా అంటే నేనున్నా అంటూ ఎవరికీ వారు ప్రకటనలు చేస్తున్నారు. ఇప్పటీకే పలువురు సీనియర్ నేతలు ఇలాగే ప్రకటించగా..తాజాగా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jagga Reddy) ప్రకటించాడు.

We’re now on WhatsApp. Click to Join.

సోమవారం సంగారెడ్డిలో నిర్వహించిన దసరా ఉత్సవాల్లో (Dasara Celebrations) పాల్గొన్న జగ్గారెడ్డి అనంతరం మాట్లాడుతూ..నాకు సీఎం (CM) కావాలని కోరిక ఉంది. మీరు ఇలాగే ఆశీర్వదిస్తే ఇంకో పదేళ్లకు నేను తెలంగాణకి సీఎం అయ్యి తీరుతానని తన మనసులోని మాట ను చెప్పుకొచ్చారు. విజయదశమి నాడు నా మనసులో మాట చెబుతున్నానన్నారు. సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి.. జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి అని.. దీన్ని ఎవరైనా కాదనగలరా అని ఆయన ప్రశ్నించారు. ఈ కాలం ఎప్పుడైనా నిర్ణయించినా.. నేను మాత్రం కచ్చితంగా సీఎం అవుతానని కీలక వ్యాఖ్యలు చేశారు జగ్గారెడ్డి. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో తన నోరు, చేతులు కట్టేశారని లేకపోతే మరిన్ని విషయాలను చెప్పే వాడినని జగ్గారెడ్డి అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తినని చెప్పారు. నియోజకవర్గంలో తాను అందుబాటులో లేక పోయినా.. తన భార్యతో పాటు అనుచరులు ఉంటారన్నారు. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా వెంటనే అక్కడికి వెళ్లిపోతానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం జగ్గారెడ్డి వ్యాఖ్యలు మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.

Read Also : Winter season Start : మంచు ముంచుతోంది… ఇక వణుకుడే వణుకుడు