పఠాన్‌చెరు బిఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి (MLA Gudem Mahipal Reddy) పార్టీ మారే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బిఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తొమ్మిది మంది ఎమ్మెల్యేలు చేరగా..మరికొంతమంది లైన్లో ఉన్నట్లు తెలుస్తుంది. వారిలో పఠాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి కూడా ఉన్నట్లు సమాచారం అందుతుంది. శనివారం సాయంత్రం మంత్రి పొంగులేటి తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లారు మహిపాల్‌రెడ్డి. దీంతో ఆయన కూడా కాంగ్రెస్(COngress)లో చేరే అవకాశం ఉందని తెలుస్తుంది. కాసేపట్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇటీవల మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. మైనింగ్‌లో అక్రమాలకు పాల్పడినట్లు మహిపాల్ రెడ్డి సోదరులపై ఆరోపణలు రావడం తో ఈడీ సోదాలు జరిపింది. ఈడీ విచారణ కు సైతం మహిపాల్ రెడ్డి హాజరయ్యారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇదిలా ఉంటె అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ తరుపున గెలిచినా వారంతా ఇప్పుడు కాంగ్రెస్ గూటికి వస్తున్నారు. ఇప్పటి వరకు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు రావడం జరిగింది. గ్రేటర్ పరిధిలో ముగ్గురు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీ లు కాంగ్రెస్ లో చేరడం జరిగింది. కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, కాలె యాదయ్య, సంజయ్ కుమార్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి లు మిగతా నియోజకవర్గాల నుండి కాంగ్రెస్ లో చేరారు. ఇప్పుడు మహిపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరితే సంఖ్య 10 కి చేరుతుంది.
Read Also : YS Sharmila : వైసీపీ వాళ్లు నేను చెప్పింది ఏంటో ఒకటికి 10 సార్లు వినాలి – YS షర్మిల