Telangana BJP: తెలంగాణ బీజేపీలో పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరబోతున్నారనే వార్తలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ అమాంతం పడిపోయింది. తెలంగాణ బీజేపీ మాజీ చీఫ్ బండి సంజయ్ ని తొలగొంచడంతో తెలంగాణ బీజేపీలో పలువురు నేతలు పార్టీపై నమ్మకాన్ని కోల్పోయారు. ఇక తెలంగాణాలో కాంగ్రెస్ పుంజుకుంటుంది. ఈ నేపథ్యంలో బీజేపీని వీడి కాంగ్రెస్ లోకి వెళ్లాలని పలువురు నేతలు భావిస్తున్నారు. తాజాగా ఆ పార్టీ నేత, మాజీ మంత్రి చంద్రశేఖర్ కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు.
మాజీ మంత్రి, బీజేపీ నేత ఎ. చంద్రశేఖర్ తో రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ , బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సమావేశమయ్యారు. చంద్రశేఖర్ పార్టీని వీడుతున్నారనే వార్తల నేపథ్యంలో ఆయన నివాసానికి వెళ్లిన ఈటల.. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. భాజపా ఎదుర్కొంటున్న ఇబ్బందులను చంద్రశేఖర్ ఈటెలకు వివరించినట్టు తెలుస్తుంది. తాను బీజేపీ కోసం కష్టపడుతున్నప్పటికీ ఎలాంటి గౌరవం లేదని ఈటెలకు చెప్పి బాధపడినట్టు సమాచారం. పార్టీలో చేరి రెండున్నరేళ్లు కావస్తున్నా తనకు ఎలాంటి పదవి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ కు ఈటల హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. పార్టీని నమ్ముకున్న వాళ్ళని పార్టీ గుర్తు పెట్టుకుంటుందని, సమయం వచ్చినప్పుడు అందరికీ తగిన గౌరవం లభిస్తుందని చంద్రశేఖర్ కు ఈటల భరోసా ఇచ్చారు.
Read More: 119 Years Later : 119 ఏళ్ల క్రితం తీసుకెళ్లిన బుక్ లైబ్రరీకి తిరిగొచ్చింది