Telangana: టీఆర్ఎస్ లోకి వెళ్లే ప్రసక్తే లేదు.. పార్టీ మార్పుపై ఈటెల క్లారిటీ..!!

  • Written By:
  • Updated On - November 18, 2022 / 10:55 AM IST

తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై బీజేపీ నేత హుజురాబాద్ ఎమ్మెల్యే మండిపడ్డారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని క్లారిటీ ఇచ్చారు. మళ్లీ గులాబీ తీర్థం పుచ్చుకుంటారని గతకొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. ఘర్ వాపసీ అంటూ ఈటల ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ ప్రచారంపై ఈటెల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేసిన ఈటెల…తాను బీజేపీ నుంచి టీఆర్ఎస్ లో చేరుతున్నానని…డిప్యూటీ సీఎం పదవి ఇస్తారని ప్రచారం చేయడం అంతా పుకారే అని కొట్టిపారేశారు. ఇది పచ్చి అబద్దం అన్న ఈటెల ఇదంతా కేసీఆర్ కుట్ర అంటూ ఫైర్ అయ్యారు.

టీఆర్ఎస్ నేను 20ఏళ్ల పనిచేశాను. 28 మంది ఎమ్మెల్యేల పది మంది బయటకు పోయారు. కానీ నేను మాత్రం పార్టీ కోసమే పనిచేశా. టీఆర్ఎస్ సంక్షోభంలో ఉన్న సమయంలో పార్టీకి అండగా నిలబడ్డాను కానీ పార్టీ మారలేదు. 2015 నుంచి పార్టీలో నన్ను ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినా పార్టీకోసం నిలబడ్డాను. నేను టీఆర్ఎస్ ను వీడలేదు. కేసీఆర్ తన పార్టీ నుంచి నన్ను వెళ్లిపోయేలా చేశారు. నేను ఎంత అంకితభావం తో పార్టీ కోసం పనిచేశాన్న అన్నది కేసీఆర్ కు బాగా తెలుసు అన్నారు.