Site icon HashtagU Telugu

IPL Black Tickets: 10 నిమిషాల్లోనే 45 వేల టిక్కెట్లు ఎలా అమ్ముడుపోయాయి: ఎమ్మెల్యే దానం

IPL Black Tickets

Danam Brs

IPL Black Tickets: హైదరాబాద్‌లో క్రికెట్ మ్యాచ్‌కు టిక్కెట్లు (IPL Black Tickets) దొరకకపోవడానికి HCAనే కారణమ‌ని ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ ఆరోపించారు. 10 నిమిషాల్లోనే 45 వేల టిక్కెట్లు ఎలా అమ్ముడుపోతాయ‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. హైద‌రాబాద్‌లోని ఉప్ప‌ల్ స్టేడియంలో జ‌రిగే మ్యాచ్‌ల‌కు టిక్కెట్లు దొర‌క‌క‌పోవ‌డం చాలా దారుణ‌మ‌ని ఆయ‌న ఆరోపించారు.

ఉప్ప‌ల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌ల టిక్కెట్లు బ్లాక్‌లో అమ్ముతున్నారనే వార్త‌ల‌పై ఆయ‌న త‌న స్పంద‌న తెలియ‌జేశారు. అసలు 45 వేల టిక్కెట్లు 10 నిమిషాల్లోనే ఎలా అమ్ముడుపోతాయ‌ని ఆయ‌న మీడియా వేదిక‌గా ప్ర‌శ్నించారు. కంప్లమెంటరీ పాస్ ల‌ను HCA బ్లాక్‌లో అమ్ముతుంద‌న్నారు. తాను DNR అకాడమీని నడుపుతున్నానని, బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేసిన‌ట్లు చెప్పారు. హెచ్‌సీఏ తీరు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తాన‌ని చెప్పారు. డేవిడ్ వార్నర్‌ ఫిక్సింగ్ చేస్తున్నాడని చెప్పినందుకే సన్ రైజర్స్ టీంలో నుండి త‌న‌ను తీసేశార‌ని ఆరోపించారు.

సన్ రైజర్స్ టీంలో ఒక్క తెలుగు ప్లేయర్ లేడు.. సన్ రైజర్స్ టీంలో తెలుగు ప్లేయర్ లేకుంటే ఉప్పల్‌లో మ్యాచ్ ఆడనివ్వను అని దానం నాగేందర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పేరుకు స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ అని ఒక్క తెలుగు ఆట‌గాడు కూడా లేడ‌ని ఆయ‌న మండిప‌డ్డారు. కనీసం ఇంపాక్ట్ ప్లేయ‌ర్ కూడా తెలుగువాడు లేక‌పోవ‌డం దారుణ‌మ‌ని అన్నారు. హెచ్‌సీఏలో జ‌రుగుతున్న‌ బ్లాక్ టికెట్స్ దందా పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, రానున్న మ్యాచుల్లో ఇలాంటివి పున‌రావృతం కాకుండా చూడాల‌న్నారు.

Also Read: CM Revanth Reddy : నేటి ఐపీఎల్‌ మ్యాచ్‌ వీక్షించేందుకు కుటంబసమేతంగా సీఎం రేవంత్‌..

ఉప్పల్ స్టేడియంలో విద్యుత్ పునరుద్ధరణ

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో విద్యుత్ సరఫరాను విద్యుత్ శాఖ పునరుద్ధరించింది. శుక్రవారం యథాతథంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. విద్యుత్ బకాయిలు చెల్లించేందుకు హెచ్‌సీఏకి విద్యుత్ శాఖ శుక్రవారం ఒకరోజు సమయం ఇచ్చింది. కాగా ఉప్పల్ స్టేడియం కరెంట్ బిల్లులు చెల్లించనందుకు ఇటీవల స్టేడియంలో విద్యుత్ సరఫరాను నిలిపివేసింది.

We’re now on WhatsApp : Click to Join