BJP Strategy: బీజేపీ ‘మిషన్ 70’

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో తెలంగాణలో  ‘ముందస్తు’ గాలులు వీస్తాయని రాజకీయ వర్గాలతో పాటు సామాన్యులు భావించారు. కానీ రీసెంట్ గా సీఎం కేసీఆర్ మీడియా ముందుకొచ్చి ‘‘తెలంగాణకు చేయాల్సింది చాలా ఉందనీ.. ముందస్తు ఆలోచన లేనే లేదు’’ అని ఆయన స్పష్టం చేశారు.

  • Written By:
  • Updated On - March 23, 2022 / 03:06 PM IST

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో తెలంగాణలో ‘ముందస్తు’ గాలులు వీస్తాయని రాజకీయ వర్గాలతో పాటు సామాన్యులు భావించారు. కానీ రీసెంట్ గా సీఎం కేసీఆర్ మీడియా ముందుకొచ్చి ‘‘తెలంగాణకు చేయాల్సింది చాలా ఉందనీ.. ముందస్తు ఆలోచన లేనే లేదు’’ అని స్పష్టం చేశారు. అయితే  తెలంగాణలో ముందస్తు ఎన్నికలు లేనప్పటికీ.. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు మాత్రం ఇప్పట్నునుంచే రంగంలోకి దిగబోతున్నాయి.  ఒకవైపు వరి ధాన్యం ఇష్యూపై కేసీఆర్ పావులు కదుపుతుంటే.. మరోవైపు బీజేపీ మాత్రం చేరికలపై ద్రుష్టి సారిస్తోంది. అయితే వచ్చే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా కమలనాథులు ‘మిషన్ 70’ గెలుపు మంత్రాన్ని జపిస్తున్నారు. రానున్న రోజుల్లో 50 నుంచి 70 మంది టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతలను పార్టీలోకి చేర్చుకునేందుకు రాష్ట్ర బీజేపీ ప్రణాళికలు రచించింది. ఇతర పార్టీల నుంచి పెద్దఎత్తున నేతలు చేరడం పార్టీ తదుపరి పెద్ద వ్యూహమని పేర్కొంటోంది. “రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాలు, మండలాలు, ఇతర గ్రామస్థాయి నాయకులను, మాజీ శాసనసభ్యులు పార్టీలో చేరనున్నారు. రానున్న రోజుల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కలిసి భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నారు’’ అని బీజేపీ నేతలు వెల్లడిస్తున్నారు.

కనీసం 24 మంది టీఆర్‌ఎస్ సీనియర్ సభ్యులు తమతో టచ్‌లో ఉన్నారని ‘బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్’ గతంలో పేర్కొన్నారు. 50 మంది నేతలు త్వరలో బీజేపీలో చేరే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం కూడా. కేంద్ర నేతల సమక్షంలో మాజీ శాసనసభ్యులు పార్టీలో చేరనున్నట్టు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. టీఆర్‌ఎస్ మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. అయితే ఆయన కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంతర్గత సమాచారం ప్రకారం బీజేపీలో చేరనున్న నేతల జాబితా సిద్ధమైంది. ఈ నెలాఖరులోగా జనగాంలో బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ యోచిస్తోంది. ర్యాలీలో నడ్డా ప్రసంగించే అవకాశం ఉంది. అయితే ఆయన షెడ్యూల్ ఖరారు కాలేదు. ఇందులో భాగంగా విడివిడిగా చేరాలా లేక భారీ కార్యక్రమంలో భాగంగా చేరికల కార్యక్రమం నిర్వహించాలా ? అనేది పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఏప్రిల్ 14న రాష్ట్ర యూనిట్ చీఫ్ బండి సంజయ్ రెండో దశ ప్రజా సంగ్రామ యాత్రలో అమిత్ షా పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. “ఆ సమయంలో కొంతమంది ముఖ్యమైన నాయకులు బిజెపిలో చేరే అవకాశం ఉంది” అని పార్టీ తెలిపాయి. ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో కేబినెట్‌ సహచరులతో కేసీఆర్‌ ఊహించని రీతిలో భేటీ కావడంతో బీజేపీ పార్టీ నాయకత్వం అలర్ట్ అయ్యింది.

మిషన్ 70 అనేది 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు BJP మంత్రం. 119 నియోజకవర్గాల బలమైన అసెంబ్లీలో ప్రస్తుతం మూడు సీట్లు మాత్రమే ఉన్న బీజేపీ 2023లో 70 సీట్లపై కన్నేసింది. తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర పార్టీ ఏనాడూ దృష్టి సారించలేదు. అయితే సిఎం కెసిఆర్ ప్రేరేపించిన ప్రాంతీయవాదం, వరి ధాన్యం పై ఆందోళన లాంటి అంశాలను పరిశీలిస్తోందని తెలంగాణ బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. ‘‘ప్రతి నియోజకవర్గానికి ముగ్గురు నేతలను గుర్తించి, ఉత్తమ అభ్యర్థికే సీటు ఇచ్చేలా చూస్తున్నాం. గతంలో మాదిరి కాకుండా ఈసారి ప్రత్యేక ప్లాన్ తో ముందుకు వెళ్లేలా వ్యూహాలు రచిస్తున్నారు. అయితే  ఎన్నికలకు ముందే టిక్కెట్లను పంపిణీ చేయాలని బిజెపి యోచిస్తోంది, ”అని కె కృష్ణసాగర్ రావు తెలిపారు. “మిషన్ 70 అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. అందులో భాగంగా ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోమని బీజేపీ నేతలు భావిస్తున్నారు.