Site icon HashtagU Telugu

Crime: అదృశ్యమైన బాలిక .. గోనె సంచిలో మృతదేహంగా లభ్యం

Josna Dead Body

Josna Dead Body

హైదరాబాద్ (Hyderabad) లో గత కొద్దీ రోజులుగా క్రైమ్ విపరీతంగా పెరిగింది. ఎక్కడ చూసిన అత్యాచారాలు , దోపిడీ , హత్యలు , గ్యాంగ్ రేప్ ఇలాంటివి ఎక్కువై పోతున్నాయి. పోలీసులు ఎక్కడిక్కడే నిఘా పెట్టిన , కోర్ట్ లు కఠిన శిక్షలు విదిస్తున్నప్పటికీ నేరగాళ్లు మాత్రం వారి నేరాలను ఆపడం లేదు. తాజాగా నాల్గు రోజుల క్రితం అదృశ్యమైన చిన్నారి (Missing Child)..నేడు గోనె సంచిలో మృతదేహం (Dead Body)గా లభ్యమైంది.

ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రభాకర్ (Prabhakar) గత కొంతకాలంగా సూరారం కాలనీ (Suraram Colony)లో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే ప్రభాకర్ కు ఇద్దరు కుమార్తెలు కాగా, జోత్స్న (Josna) పెద్ద కుమార్తె, వయసు ఏడు సంవత్సరాలు. ఈ క్రమంలో ఈ నెల 12న కుమార్తె ఏం.జోష్న(7) కనిపించడం లేదని సూరారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

నేడు మేడ్చల్ శివారు ప్రాంత మైన బాసర గడి గ్రామంలో గోనె సంచిలో ఆదృశ్య మైన బాలిక మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ విషయంపై పోలీసుల నుంచి సమాచారం అందుకున్న బాలిక తండ్రి ప్రభాకర్, తల్లి సుమ కన్నీరు మున్నీరవుతున్నారు. వారి పక్క ఊరైన తిరుపతి వీరి ఇంటికి వచ్చే క్రమంలో సుమతో పరిచయం ఏర్పడింది. ఆమెను కలిసేందుకు వస్తున్న క్రమంలో పాప అడ్డు వస్తుందనే హత్య చేసి ఉంటాడని పోలీసులు చెబుతున్నారు. కేసు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Read Also : Breast Cancer : రొమ్ము క్యాన్సర్‌ గుర్తించదగిన లక్షణాలు లేకుండా కూడా ఇది సంభవిస్తుంది..!