మిస్ వరల్డ్ 2024 ఫైనల్ పోటీల్లో కిరీటం దక్కించుకున్న క్రిస్టినా పిస్కోవా (Miss World Kristina Piskova) మంగళవారం ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని (Yadadri Lakshmi Narasimha Swamy Temple) దర్శించుకుంది. ఈ సందర్బంగా సోషల్ మీడియా వేదికగా దర్శన విషయాలను పంచుకుంది. “యాదగిరి గుట్ట ఆలయాన్ని సందర్శించడం నాకు ఎంతో ఆనందం , చక్కటి అనుభూతి కలిగింది. మరికొన్ని వారాల్లో 120 మంది మిస్ వరల్డ్ పాల్గొనేవారు ఇక్కడికి రాబోతున్నాయని తెలియజేయడం సంతోషంగా ఉంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే! తెలంగాణలో మరిన్ని రహస్యమైన అందాలను చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అని ఆమె తన అనుభూతులను వ్యక్తం చేసింది.
Jinping Vs Army : జిన్‌పింగ్‌పై తిరుగుబాటుకు యత్నించారా ? కీలక ఆర్మీ అధికారులు అరెస్ట్
తెలంగాణలోని యాదగిరి గుట్ట ఆలయం ప్రాచీన పవిత్ర స్థలంగా ప్రసిద్ధి చెందింది. ఇది శ్రీలక్ష్మి నరసింహ స్వామికి అంకితమైన ఆలయంగా నిలిచింది. భగవాన్ విష్ణువు నరసింహ అవతారంగా ఇక్కడ భక్తులకు దర్శనమిస్తారని విశ్వసిస్తారు. అత్యంత శాంతిమయమైన పరిసరాలు, అపూర్వ శిల్పకళా వైభవం, ఆధ్యాత్మిక గంభీరత ఈ ఆలయాన్ని ప్రత్యేకంగా నిలిపాయి. “ఇది తప్పక సందర్శించాల్సిన ప్రదేశం. దీని అద్భుతమైన శిల్పకళ, ప్రశాంత వాతావరణం, ఆధ్యాత్మిక వైభవం నాకు మంత్రముగ్ధులను చేశాయి ” అని చెప్పుకొచ్చింది.
చెక్ రిపబ్లిక్‌కు చెందిన క్రిస్టినా పిస్కోవా 71వ ప్రపంచ సుందరి(Miss World 2024) టైటిల్‌ను గెలుచుకుంది. ముంబై(mumbai)లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన మిస్ వరల్డ్ 2024 ఫైనల్ పోటీల్లో కిరీటం దక్కించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 110 దేశాలకుపైగా చెందిన ముద్దుగుమ్మలు ఈ పోటీలో పాల్గొనగా చివరగా చెక్ రిపబ్లిక్‌కు చెందిన క్రిస్టినా పిస్కోవా(Krystyna Pyszkova) కిరీటాన్ని కైవసం చేసుకున్నారు.