Site icon HashtagU Telugu

Miss World Contestants : బతుకమ్మ ఆడిన ప్రపంచ సుందరీమణులు

Miss World Constetants Play

Miss World Constetants Play

మిస్ వరల్డ్ 2025 (Miss World Contestants )పోటీ కోసం భారతదేశానికి వచ్చిన వివిధ దేశాల అందాల భామలు బుధవారం తెలంగాణలోని చారిత్రక నగరం ఓరుగల్లు(Warangal )ను సందర్శించారు. ఈ సందర్శనలో భాగంగా భారతీయ సంప్రదాయాలపై మక్కువను చాటుతూ, రాష్ట్రానికి ప్రత్యేకంగా గుర్తింపు ఇచ్చే బతుకమ్మ పండుగలో పాల్గొని సందడి చేశారు. హన్మకొండ హరిత కాకతీయ రిసార్టులో జిల్లా యంత్రాంగం వారిని సంప్రదాయ మేళతాళాలతో ఘనంగా స్వాగతించింది. స్థానిక మహిళలతో కలిసి వారు బతుకమ్మ ఆడిన (Bathukamma celebrations) దృశ్యాలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

Liquor Scam : గోవిందప్పకు రిమాండ్

రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మల చుట్టూ తిరుగుతూ, చప్పట్లు కొడుతూ ప్రపంచ సుందరీమణులు ఆనందంగా గడిపారు. చీరకట్టులో మెరిసిపోతూ భారతీయ ఆచారాన్ని గౌరవించిన విదేశీ అతిథులు అందరినీ ఆకట్టుకున్నారు. అనంతరం వారు యునెస్కో వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలోని కాకతీయ శిల్పకళా వైభవం చూసి మంత్రముగ్ధులయ్యారు. గ్రూప్ ఫోటోలతో కూడిన ఈ పర్యటన వారికీ గుర్తుండిపోయే అనుభవంగా నిలిచింది.

ఈ పర్యటనకు భారీ భద్రతా ఏర్పాట్లు చేసిన జిల్లా పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ నిర్వహించారు. ముగ్గురు డీసీపీలు, పదిమూడు మంది ఏసీపీలు, వందలాది మంది మహిళా పోలీసులు, హోంగార్డులు, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ లతో కలిపి వెయ్యికి పైగా సిబ్బంది భద్రతా పనుల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటడంలో తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నం ప్రశంసనీయం.