ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మిస్ వరల్డ్ 2025 (Miss World 2025)పోటీలు నేటి నుంచి హైదరాబాద్(Hyderabad)లో ఘనంగా ప్రారంభం కానున్నాయి. గచ్చిబౌలి స్టేడియం(Gachibowli Stadium)లో జరుగనున్న ఓపెనింగ్ సెర్మనీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ పోటీలు 120 దేశాల నుంచి వచ్చిన అందాల భామల మధ్య ఉత్కంఠభరితంగా సాగనున్నాయి. మన దేశం తరఫున నందిని గుప్తా పాల్గొనడం గర్వకారణంగా మారింది.
India Attack : పాక్ వైమానిక స్థావరాలపై భారత్ ఎటాక్.. బార్డర్‌లోని డ్రోన్ల లాంచ్ ప్యాడ్ ధ్వంసం
ఈ వేడుకకు వెయ్యి మందికి పైగా ప్రత్యేక అతిథులు, టాలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరుకానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గచ్చిబౌలిలోని వేదికను అలంకరించడమే కాకుండా, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ పోటీలు టూరిజం, ఆతిథ్య రంగాలకు బూస్ట్ ఇచ్చే అవకాశం ఉంది.
అయితే ప్రస్తుతం పాకిస్తాన్ – భారత దేశాల మధ్య ఉద్రిక్తతల (India – Pakistan War) నేపథ్యంలో ఈ కార్యక్రమం సజావుగా సాగుతుందా అనే సందేహాలు కొన్ని వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో భద్రతను ఏర్పాటు చేసింది. అయినప్పటికీ ప్రతిపక్షాలు యుద్ధం నడుస్తున్న సమయంలో పోటీలను వాయిదా వేయాలని సూచిస్తున్నాయి. అయినా ప్రభుత్వ సంకల్పం వల్ల, ఈ పోటీలు విజయవంతంగా పూర్తవుతాయని అధికార వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి.