Miss World 2025: కశ్మీరులోని పహల్గాంలో ఉగ్రదాడి ఘటన తర్వాత లెక్కలన్నీ మారిపోయాయి. పాకిస్తాన్‌తో అన్ని రకాలుగా తెగదెంపులు చేసుకోవడానికి భారత్ రెడీ అయింది. ఈ నేపథ్యంలో మే 7 నుంచి మే 31 వరకు తెలంగాణలోని హైదరాబాద్ వేదికగా జరగనున్న మిస్ వరల్డ్ పోటీలలో కీలక మార్పు జరిగే అవకాశం ఉంది. ఈ పోటీలలో పాకిస్తాన్ సహా 120 దేశాల యువతులు పాల్గొనబోతున్నారు. ఈ ఏడాది జరిగిన మిస్ గ్లోబల్ పోటీలలో పాకిస్తాన్ నుంచి అన్నికా జమాల్ ఇక్బాల్ పాల్గొన్నారు. 2023లో జరిగిన మిస్ పాకిస్తాన్ వరల్డ్ పోటీలలో మిస్బా అర్షద్, 2024లో జరిగిన మిస్ పాకిస్తాన్ వరల్డ్ పోటీల్లో వాజిహా ఇహ్సాన్ పాల్గొన్నారు.
Also Read :India Vs Pak : కరాచీలో క్షిపణి పరీక్షలు.. అరేబియా సముద్రంలో భారత్ ఏం చేసిందంటే..
వాళ్లకు నో ఎంట్రీ
ఇక హైదరాబాద్‌లో ఈసారి జరగనున్న మిస్ వరల్డ్ పోటీలలోనూ(Miss World 2025) పాకిస్తాన్ నుంచి ఒకరు పాల్గొనే ఛాన్స్ ఉంది. అయితే ప్రస్తుతం ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్నందున.. పాకిస్తానీ అందాల భామలకు భారత్‌లోకి ఎంట్రీ లభించే అవకాశమే లేదు. ఎందుకంటే పాకిస్తానీలకు వీసాల జారీని భారత్ ఆపేసింది. పాకిస్తానీలు భారత్‌లో ఉండటానికి వీల్లేదని తేల్చి చెప్పింది. అందుకే హైదరాబాద్ మిస్ వరల్డ్ పోటీలలో పాకిస్తానీ భామలు మనకు కనిపించరు.
Also Read :Maoists Hunting: 300 మంది మావోయిస్టుల దిగ్బంధం.. 5వేల మందితో భారీ ఆపరేషన్
తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా..
మిస్ వరల్డ్ పోటీలను 1951లో యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఎరిక్ మోర్లీ స్థాపించారు. అప్పటినుంచి ఈ ఐకానిక్పోటీలు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో జరుగుతున్నాయి. ప్రపంచ సుందరి పోటీలు 28 సంవత్సరాల తర్వాత భారత్‌లో జరగనున్నాయి. అందుకే ఇప్పుడు యావత్ దేశం చూపు మన హైదరాబాద్ వైపు ఉంది. వీటిని తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈ పోటీలను నిర్వహించేందుకు రాష్ట్ర సర్కారు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. పోటీల్లో పాల్గొనే వారందరికీ పటిష్ట భద్రతను కల్పించనున్నారు.