Site icon HashtagU Telugu

Miss World Grand Finale: రేపే మిస్ వరల్డ్ ఫైనల్స్.. హైటెక్స్ వేదికగా కార్యక్రమం, జ‌డ్జిలు వీరే!

Miss World Grand Finale

Miss World Grand Finale

Miss World Grand Finale: 72వ మిస్ వరల్డ్ గ్రాండ్ ఫైనల్ (Miss World Grand Finale) తెలంగాణ హైదరాబాద్‌లో హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో మే 31న సాయంత్రం 6:30 గంటలకు జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా 108 మగువలు వివిధ దేశాల పోటీదారులు అందం, ఉద్దేశం, ఐక్యతను జరుపుకునే ఈ కార్యక్రమంలో మిస్ వరల్డ్ కిరీటం కోసం పోటీపడతారు. సుమారు 20 రోజుల పాటు జరిగిన వివిధ కార్యక్రమాల్లో వీరంతా పాల్గొని తమ ప్రతిభను చాటటంతో పాటు, తెలంగాణలో ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించారు. తెలంగాణ జరూర్ ఆనా నినాదాన్ని ప్రపంచవ్యాప్తం చేశారు.

మిస్ వరల్డ్ 2016 స్టెఫానీ డెల్ వాలె, భారతీయ ప్రెజెంటర్ సచిన్ కుంభర్ హోస్ట్‌లుగా వ్యవహరిస్తారు. బాలీవుడ్ తారలు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఇషాన్ ఖట్టర్ ఫైనల్స్‌లో స్టేజీపైన లైవ్ ప్రదర్శనలు ఇవ్వనున్నారు.

ప్రముఖ మానవతావాది, నటుడు సోనూ సూద్‌కు మిస్ వరల్డ్ హ్యూమానిటేరియన్ అవార్డు ప్రధానం చేయనున్నారు. ఆయన ఫైనల్స్‌కు న్యాయ నిర్ణేతగా కూడా వ్యవహరిస్తారు. ఇతర జ్యూరీలుగా సుధా రెడ్డి, డాక్టర్ కారినా టర్రెల్ (మిస్ ఇంగ్లాండ్ 2014), మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోర్లీ ఉన్నారు. మిస్ వరల్డ్ 2017, బాలీవుడ్ నటి మనుషి చిల్లర్ ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా కనిపించనున్నారు. ఈ గ్రాండ్ ఫినాలే కార్యక్రమం భారతదేశంలో సోనీ లివ్‌లో లైవ్ స్ట్రీమ్ అవుతుంది. కొన్ని దేశాలలో జాతీయ టెలివిజన్‌లో ప్రసారం అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా www.watchmissworld.com ద్వారా హై డెఫినిషన్‌లో అందుబాటులో ఉంటుంది.

Also Read: Mumbai Indians: నేడు ఎలిమినేట‌ర్ మ్యాచ్‌.. ముంబై జ‌ట్టుకు భారీ షాక్‌!

ఫైనల్స్‌లో ఎంపిక విధానం

108 మంది పోటీదారుల నుండి, ప్రతి ఖండం (అమెరికా& కరీబియన్, ఆఫ్రికా, యూరప్, ఆసియా & ఓషియానియా) నుండి 10 మంది సెమీఫైనలిస్టులు, మొత్తం 40 మంది క్వార్టర్ ఫైనల్స్ కు చేరతారు. కొందరు పోటీదారులు ఫాస్ట్-ట్రాక్ ఛాలెంజ్‌ల ద్వారా ఇప్పటికే క్వార్టర్ ఫైనల్స్‌ కు చేరుకున్నారు,

వారి వివరాలు ఇలా ఉన్నాయి

మిస్ వరల్డ్ ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ప్రభావవంతమైన ఫెస్టివల్‌గా ప్రతీయేటా నిలుస్తోంది. కేవలం అందచందాలకే ప్రాముఖ్యత కాకుండా ఈ కార్యక్రమం తెలివితేటలు, సామాజిక న్యాయం, సాంస్కృతిక మార్పిడి, ఉద్దేశ్యం, నాయకత్వ లక్షణాల ద్వారా మహిళలను సాధికారతను చేస్తుంది. మిస్ వరల్డ్ ఫైనల్ కార్యక్రమం శనివారం (మే 31న) హైదారాబాద్ హైటెక్స్ నుంచి ప్రపంచ వ్యాప్తంగా సోనీ లివ్, మిస్ వరల్డ్ యూ ట్యూబ్ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడతుంది, ప్రపంచ వ్యాప్తంగా 72వ మిస్ వరల్డ్ ఎంపిక కార్యక్రమం ఒక మరపురాని సాయంత్రంగా మిగిలిపోనుంది.