Miss World 2025 : తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ వేదికగా మే 7 నుంచి 72వ మిస్ వరల్డ్ 2025 పోటీలు అట్టహాసంగా జరగనున్నాయి.మే 31 వరకు ఈ పోటీలు కొనసాగుతాయి. వీటిలో 120కిపైగా దేశాలకు చెందిన అందాల భామలు పాల్గొననున్నారు. ఈ ఈవెంట్స్ వేదికగా తెలంగాణ కల్చర్, హెరిటేజ్, సంప్రదాయాలు, చరిత్ర, పర్యాటక ప్రాంతాలు, మెడికల్ టూరిజం, సేఫ్టీ టూరిజంలను ప్రదర్శించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ‘‘ప్రపంచం కళ్లన్నీ తెలంగాణ వైపే’’ అనే నినాదంతో ఈ ఈవెంట్స్‌ను(Miss World 2025) నిర్వహించనున్నారు. ఇందుకు అనుగుణంగా మే 12 నుంచి మే 31 వరకు కార్యక్రమాల షెడ్యూల్‌ను రెడీ చేశారు.ఆ వివరాలను చూద్దాం..
మిస్ వరల్డ్ 2025 షెడ్యూల్ ఇదీ..
మే 12న
- నాగార్జునసాగర్‌లో ఉన్న బుద్ధవనం ప్రాజెక్టును, బుద్ధిష్ట్ థీమ్ పార్కును ప్రపంచానికి తెలియజేసేలా పర్యటన ఉంటుంది. మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొనే అందాల భామలు బుద్ధవనం ప్రాజెక్టును సందర్శిస్తారు.
- హైదరాబాద్ సాంస్కృతిక వారసత్వం గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేసేలా చార్మినార్ , లాడ్ బజార్‌లలో అందాల భామలు ‘హెరిటేజ్ వాక్’ నిర్వహిస్తారు.
మే 13న
- హైదరాబాద్‌లోని చౌమహల్లా ప్యాలెస్‌ను అందాల భామలు సందర్శిస్తారు. అక్కడ నిర్వహించే లైవ్ మ్యూజిక్ కన్సర్ట్‌ను చూస్తారు.
మే 14న
- గ్రూప్ 1 కేటగిరీలో ఉన్న మిస్ వరల్డ్ పోటీదారులు చారిత్రక, ఆధ్యాత్మిక నగరం వరంగల్‌లోని వేయి స్థంభాల గుడి, వరంగల్ పోర్ట్‌లను సందర్శిస్తారు.
- గ్రూప్ 2 కేటగిరీలో ఉన్న మిస్ వరల్డ్ పోటీదారులు యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని సందర్శిస్తారు. అక్కడ పేరిణి నృత్య ప్రదర్శనను తిలకిస్తారు.
మే 15న
- గ్రూప్ 1 కేటగిరీలోని మిస్ వరల్డ్ పోటీదారులు యాదగిరిగుట్ట ఆలయాన్ని సందర్శిస్తారు.
- గ్రూప్ 2 కేటగిరీలోని మిస్ వరల్డ్ పోటీదారులు హ్యాండ్లూమ్ ఎక్స్‌పీరియన్సల్ టూర్‌లో భాగంగా పోచంపల్లిలో చేనేత వస్త్రాల తయారీని, ప్రదర్శనను తిలకిస్తారు.
Also Read :Vehicle Driving Test : డ్రైవింగ్ టెస్ట్ మరింత టఫ్.. ఇక ‘సిమ్యులేటర్’పైనా నెగ్గాల్సిందే
మే 16న
- వివిధ దేశాల రోగులను హైదరాబాద్‌కు ఆకర్షించే ఉద్దేశంతో నగరంలోని ఏఐజీ హాస్పిటల్‌లో నిర్వహించే మెడికల్ టూరిజం ఈవెంటుకు గ్రూప్ 1 కేటగిరీ మిస్ వరల్డ్ పోటీదారులు హాజరవుతారు. ఆధునిక ఆస్పత్రుల ప్రత్యేకతలను వారికి వివరిస్తారు.
- గ్రూప్ 2 కేటగిరీలోని పోటీదారులు మహబూబ్ నగర్‌లోని పిల్లలమర్రి వృక్షాన్ని సందర్శిస్తారు.
- గ్రూప్ 2 కేటగిరీలోని పోటీదారులు మే 16న సాయంత్రం హైదరాబాద్ నగరంలోని ఎక్స్పీరియన్ ఎకో పార్కును సందర్శిస్తారు.
మే 17న
- మిస్ వరల్డ్ పోటీదారులు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నిర్వహించే మిస్ వరల్డ్ స్పోర్ట్స్ ఫైనల్ పోటీలలో పాల్గొంటారు.
- ప్రఖ్యాత రామోజీ ఫిలిం సిటీని మిస్ వరల్డ్ పోటీదారులు సందర్శిస్తారు.
మే 18న
- మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే అందాల భామలు తెలంగాణ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శిస్తారు. పౌరుల భద్రతకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి తెలుసుకుంటారు. ప్రభుత్వం సేఫ్టీ టూరిజం ఇనీషియేటివ్స్‌ను పరిశీలిస్తారు.
- మిస్ వరల్డ్ పోటీదారులకు తెలంగాణ రాష్ట్ర గ్రోత్, చరిత్రను తెలియజేస్తారు. ట్యాంక్ బండ్‌పై ప్రతి ఆదివారం ఏర్పాటు చేసే సండే – ఫండే కార్నివాల్‌ను సందర్శిస్తారు.
మే 20న
- మిస్ వరల్డ్ పోటీదారులను కాంటినెంటల్ క్లస్టర్ ఆధారంగా స్ట్రీమ్ లైన్ చేసేందుకు రీజియన్ స్పెసిఫిక్ ఫాస్ట్ ట్రాక్ సెలెక్షన్స్‌ను నిర్వహిస్తారు.
- ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ కు గ్రూప్ 1 కేటగిరీ అందాల భామలు హాజరవుతారు.
మే 21న
- గ్రూప్ 2 కేటగిరీ పోటీదారులు శిల్పారామంలో తెలంగాణ కళాకారులు నిర్వహించే ఆర్ట్స్ , క్రాఫ్ట్స్ వర్క్ షాప్‌కు హాజరవుతారు. స్వయంగా వాటి తయారీలో భాగమై, తయారీ ప్రక్రియ గురించి తెలుసుకుంటారు.
మే 22న
- మిస్ వరల్డ్ టాలెంట్ ఫినాలే లో అందాల భామలు పాల్గొంటారు.
మే 23న
- హెడ్ టు హెడ్ ఛాలెంజ్ ఫినాలేలో అందాల భామలు పాల్గొంటారు.
మే 26న
- బ్యూటీ విత్ ప్యాషన్ ఈవెంట్‌లో అందాల భామలు పాల్గొంటారు.
మే 31న
- మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలేలో అందాల భామలు పాల్గొంటారు. ఛైర్ పర్సన్, సీఈఓ జూలియా ఎవెలిన్ మోర్లీకి స్వాగతం పలుకుతారు.