Minor Girl Raped: వరంగల్ లో దారుణం.. మైనర్ బాలికపై 6 నెలలుగా అత్యాచారం

తెలంగాణలోని వరంగల్‌ (Warangal)లో దారుణం జరిగింది. ఓ మైనర్‌ బాలికపై అన్నదమ్ములిద్దరూ అత్యాచారం (Raped) చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధిత బాలిక(15) పదో తరగతి చదువుతోంది. ఆమె ఇంటి సమీపంలో ఉంటున్న అజ్మద్‌ అలీ(26), అబూ(22) గత 6 నెలలుగా బాలికపై అత్యాచారం చేస్తున్నారు.

  • Written By:
  • Publish Date - January 6, 2023 / 08:35 AM IST

తెలంగాణలోని వరంగల్‌ (Warangal)లో దారుణం జరిగింది. ఓ మైనర్‌ బాలికపై అన్నదమ్ములిద్దరూ అత్యాచారం (Raped) చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధిత బాలిక(15) పదో తరగతి చదువుతోంది. ఆమె ఇంటి సమీపంలో ఉంటున్న అజ్మద్‌ అలీ(26), అబూ(22) గత 6 నెలలుగా బాలికపై అత్యాచారం చేస్తున్నారు. బాలిక తల్లిదండ్రులకు ఈ విషయం తెలియడంతో గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

వరంగల్‌లో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు యువకులను తెలంగాణ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. బాధితురాలు, నిందితులు వేర్వేరు వర్గాలకు చెందినవారు. మైనర్ బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో యువకులను అరెస్టు చేశారు. వరంగల్ పోలీస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ తెలిపిన వివరాల ప్రకారం.. గత ఆరు నెలల్లో తమ కుమార్తెను ఇద్దరు ముస్లిం పొరుగువారు పలుమార్లు ప్రలోభపెట్టి అత్యాచారం చేశారని పేర్కొంటూ మైనర్ బాలిక తల్లిదండ్రుల నుండి బుధవారం రాత్రి వరంగల్ పోలీసులకు ఫిర్యాదు అందింది. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు చర్యలు తీసుకున్నారని పోలీసు అధికారి తెలిపారు.

Also Read: Earthquake: పలుచోట్ల భూ ప్రకంపనలు.. వారం వ్యవధిలో ఢిల్లీలో రెండోసారి

మేము ఫిర్యాదును స్వీకరించినందున వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నాము. నిందితులిద్దరిపై ఐపీసీ, పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని ఆయన తెలిపారు. ఈ ఘటనకు వ్యతిరేకంగా కొందరు స్థానిక బీజేపీ అనుచరులు నిరసనకు దిగారని, అత్యాచారానికి సంబంధించిన సమాచారం అందుకున్న నిందితుల నివాసానికి చేరుకుని అక్కడ ఉన్న వస్తువులను ధ్వంసం చేశారని వరంగల్ సీపీ తెలిపారు. తదుపరి విచారణ కొనసాగుతోందని సీపీ తెలిపారు. అయితే.. పోలీసుల తీరు నిరసిస్తూ జిల్లాలో పలు చోట్ల హిందూ సంఘాలు, బిజెపి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. దోషులను కఠినంగా శిక్షించేంతవరకు ఆందోళనలు ఉంటాయంటూ హిందూ సంఘాలు హెచ్చరించాయి. కాగా కేసు నమోదు చేయడంలో పోలీసులు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. బాధితురాలి తండ్రి పలుమార్లు పోలీసులను కలిశారని వారు తెలిపారు. నిందితుల నివాసాలపై గురువారం కూడా కొందరు బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. మిల్స్ కాలనీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. రాస్తారోకో చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.