Indian Racing League: హైదరాబాద్‌ ఫార్ములా కారు రేసింగ్‌లో వరుస ప్రమాదాలు..!

ట్యాంక్‌బండ్‌పై ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌తో నగరంలో ఫార్ములా ఈ రేస్‌ ట్రయల్‌ రన్స్‌ జరుగుతుండగా,

Published By: HashtagU Telugu Desk
Woman Racer

Woman Racer

ట్యాంక్‌బండ్‌పై ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌తో నగరంలో ఫార్ములా ఈ రేస్‌ ట్రయల్‌ రన్స్‌ జరుగుతుండగా.. అక్కడక్కడా కొన్ని ప్రమాద ఘటనలు చోటుచేసకుంటున్నాయి. శనివారం రేస్ జరుగుతున్న సమయంలో చెట్టు కొమ్మ ఒకటి కారుపై పడడంతో పెను ప్రమాదం తప్పింది. శనివారం ట్యాంక్‌బండ్‌ పై ఇండియన్ రేసింగ్ లీగ్ ట్రయల్ రన్ జరుగుతున్నప్పుడు ప్రసాద్ ఐమాక్స్ దగ్గర ఈ సంఘటన జరిగింది. కొమ్మను ఢీకొట్టిన కొద్దిసేపటికే కారు ఆగిపోవడంతో ఈ ఈవెంట్‌లో పెను ప్రమాదం తప్పింది.

మరో సంఘటనలో ఎన్టీఆర్ మార్గ్‌లో డ్యూటీలో ఉన్న నూర్ ఆలం అనే రేస్ ట్రాక్ కార్మికుడు కూడా గాయపడ్డాడు. ఆ వ్యక్తి చేయి విరిగింది.
మరో చిన్న ప్రమాదంలో.. ఫార్ములా ఈ కారు టైర్ రిమ్ నుండి విడిపోయింది. అయితే కారు డ్యామేజ్‌ కావడంతో డ్రైవర్‌ సురక్షితంగా బయటపడ్డాడు. తాజాగా హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై జరుగుతున్న ఫార్ములా కారు రేసింగ్‌లో ఆదివారం కూడా మరో ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకుపోతున్న 2 ఫార్ములా రేసింగ్‌ కార్లు ఢీకొన్నాయి. దీంతో ఆ కార్లు నుజ్జునుజ్జు అయ్యాయి.

ఈ ఘటనలో ఓ మహిళా రేసర్ గాయపడింది. ఎన్టీఆర్ మార్గ్ రేసింగ్ సర్క్యూట్ లో కార్లు దూసుకుపోతుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన మహిళా రేసర్ ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రమాదానికి గురైన కార్లను క్రేన్ల సాయంతో రోడ్డు మీద నుంచి తీశారు. హైదరాబాద్ లో ఇండియన్ రేసింగ్ లీగ్ సందర్భంగా రేసింగ్ ట్రాక్ చుట్టూ 15 అడుగుల మేర ఐరన్ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.

  Last Updated: 20 Nov 2022, 06:43 PM IST