Medigadda Project : ఈ నెల 29న మేడిగడ్డకు ఉత్తమ్‌, శ్రీధర్‌బాబు

  • Written By:
  • Publish Date - December 25, 2023 / 11:19 AM IST

ఈ నెల 29న మేడిగడ్డ ప్రాజెక్ట్‌ (Medigadda Project)ను మంత్రులు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, శ్రీధర్‌బాబు సందర్శించనున్నారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో మంత్రులు మెడిగడ్డ కు బయలుదేరుతారు. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేస్తారని ఈ మేరకు సాగునీటి శాఖ, పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటన చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

తెలంగాణ(Telangana) అసెంబ్లీ(Assembly)లో ప్రాజెక్టులు, విద్యుత్, ఆర్థిక పరిస్థితుల ఫై వాదోపవాదనలు జరిగిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ప్రాజెక్టులపై కాంగ్రెస్(Congress), బీఆర్‌ఎస్(BRS) మధ్య తీవ్ర స్థాయిలో మాటల తూటాలు పేలాయి. ప్రాజెక్టుల నిర్మాణాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న కాంగ్రెస్ ప్రబుత్వం వాటిని బట్టబయలు చేసేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పటు చేసింది. ఇక ఇప్పుడు ఆ కమిటీ లు నేరుగా ప్రాజెక్టులను సందర్శించబోతున్నారు. అక్కడి వాస్తవ పరిస్థితులు తెలుసుకోనున్నారు. ఇందులో బాగంగా ఈ నెల 29న మేడిగడ్డ(Medigadda)ను మంత్రులు సందర్శించనున్నారు. సందర్శన అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం, కొత్త ఆయకట్టు, స్థిరీకరణ ఆయకట్టు వివరాలు మీడియాకు తెలపనున్నారు. ప్రాజెక్టు నిర్వహణకు అవసరమైన విద్యుత్ అంశాన్ని కూడా పరిశీలించి తెలపనున్నారు. మెడిగడ్డ, సిందిళ్ళ, అన్నారం బ్యారేజ్ సమస్యలు, వాటి పరిష్కారాలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించనున్నారు.

 

Read Also : Congress 6 Guarantees : ఆరు గ్యారెంటీల పట్ల రేషన్ కార్డు లేనివారి ఆందోళన