Rythu Bharosa: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా కసరత్తులు చేస్తోంది. అయితే చెప్పిన విధంగానే రైతులకు రుణమాఫీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. రైతులకు ఇచ్చిన మరో హామీని అమలు చేయనుంది. ఇప్పటికే రైతు భరోసాకు (Rythu Bharosa) సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం రూపొందిస్తున్న విషయం తెలిసిందే. అయితే సంక్రాంతి నుంచి రైతు భరోసాను అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు అధికారులు ఇప్పటికే ప్రకటించిన విషయం మనకు తెలిసిందే.
మంత్రి కీలక ప్రకటన
ఇకపోతే రాష్ట్రంలోని రైతులు ఆశగా ఎదురుచూస్తున్న రైతు భరోసాపై మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి నుంచి పెట్టుబడి సాయాన్ని రైతుల అకౌంట్లలో జమ చేసేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. అంతేకాకుండా రైతులకు పిడుగు లాంటి వార్త చెప్పారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాగు చేసే భూమికే పెట్టుబడి సాయం అందించటం తమ ఉద్దేశమని మంత్రి తుమ్మల మరోసారి స్పష్టం చేశారు. దీంతో చాలామంది రైతులు అయోమయంలో పడ్డారు. ఇప్పుడు చాలా మంది రైతులు తమ పొలాలను కౌలుకు ఇచ్చి భూమి ఉన్నవారు సొంతంగా వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు అలాంటి వారికి రైతు భరోసా వస్తుందా? రాదా అనే గందరగోళంలో పడిపోయారు.
Also Read: New Year : కొత్త ఏడాది సందర్బంగా కీలక నిర్ణయం తీసుకున్న పవన్ కళ్యాణ్
రైతు భరోసా రూ. 10 వేల నుంచి రూ. 15 వేలు?
గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు రైతు భరోసా కింద రూ. 10 వేలు అందించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పది వేలకు మరో ఐదు వేలు వేసి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అంటే రైతులకు రూ. 15 వేలు పెట్టుబడి సాయంగా అందించనున్నారు. గత ప్రభుత్వంలో రైతు భరోసా డబ్బులు దుర్వినియోగం అయ్యాయని కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలు చేసిన విషయం తెలిసిందే.