Site icon HashtagU Telugu

Gandhi Bhavan : వారానికి రెండు రోజులు మంత్రులు గాంధీ భవన్ కు రావాల్సిందే – టీపీసీసీ చీఫ్

Mahesh Kumar Goud took charge as the president of Telangana PCC

Mahesh Kumar Goud took charge as the president of Telangana PCC

Ministers at Gandhi Bhavan : టీపీసీసీ (TPCC) గా బాధ్యతలు చేపట్టిన మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud)..అధిష్టానం ఇచ్చిన పనుల్లో నిమగ్నమయ్యారు. తాజాగా పార్టీ విధి విధానాలను, మంత్రుల షెడ్యూల్ ను రూపొంచారు. TPCC గా పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మంత్రులు ప్రతి వారంలో రెండుసార్లు గాంధీ భవన్ రావాలని సూచించారు. ప్రతి బుధ, శుక్రవారాలలో ఒక్క మంత్రి గాంధీ భవన్ (Gandhi Bhavan) కు రావాలని ఆదేశించారు. తాను బాధ్యతలు తీసుకుని వారం గడవకంటే ముందే పార్టీకి – నాయకులకు – కార్యకర్తలకు అనుసంధానముగా వ్యవహరిస్తున్నారు. తాను బాధ్యతలు తీసుకున్న రోజు చెప్పినట్లుగానే, ప్రతి రోజు 5-6 గంటల సమయం పార్టీ కార్యకర్తల కోసం కేటాయిస్తున్నారు. అలాగే తనతో పాటు ప్రభుత్వంలోని మంత్రులు ఇప్పటి నుండి వారానికి రెండు రోజులు కాంగ్రెస్ పార్టీ గాంధీభవన్ ఆఫీస్ లో ఒక్కోరోజు ఒక మంత్రి అందుబాటులో ఉంటారని, ఉదయం 11.00 నుండి మధ్యాహ్నం 02.00 గంటలకు రోజుకు 3గంటలు, అందుబాటులో ఉంటారని అది ఈ వచ్చే శుక్రవారం నుండే మొదలు పెడుతున్నట్లు తెలుస్తుంది. పదేళ్ల తరువాత వచ్చిన ప్రభుత్వాన్ని, 2023 అసెంబ్లీ ఎన్నికలు, తరువాత వచ్చిన 2024 పార్లమెంట్ ఎన్నికలు, ఇప్పుడు కార్యకర్తలు/క్యాడర్ – పార్టీ అధ్యక్షుడు మధ్య సాన్నిహిత్యాన్ని మరింత పెంచడానికి, అలాగే కార్యకర్తల సమస్యలను నేరుగా తీర్చడానికి ఇదో గొప్ప ఆలోచనే అని అంత చెపుతున్నారు.

మరోపక్క ..

డిఎస్పీగా జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చిన మహిళా బాక్సర్ నికత్ జరీన్…..

మహిళా బాక్సర్ నికత్ జరీన్ (Nikhat Zareen) డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (స్పెషల్ పోలీస్) గా జాయినింగ్ రిపోర్ట్ ను బుధవారం నాడు రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ (State Director General of Police Dr. Jitender) కు అందజేశారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన నికత్ జరీన్ బాక్సింగ్ క్రీడలో రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ గానూ, కామన్వెల్త్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ ను ,ఏషియన్ గేమ్స్ లో బ్రాంజ్ మెడల్ ను గెలుచుకున్న విషయం విధితమే. వీటితోపాటు ఇటీవల ప్యారిస్ లో ముగిసిన ఒలంపిక్స్ క్రీడలలో ఆమె పాల్గొన్నారు. నికత్ జరీన్ ను డీఎస్పీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో, డి.ఎస్.పి (స్పెషల్ పోలీస్) గా జాయినింగ్ రిపోర్టు ను బుధవారం నాడు ఆమె DGP కి అందజేశారు.

Read Also : Athishi Swearing: సెప్టెంబర్ 21న ముఖ్యమంత్రిగా అతిషి ప్రమాణస్వీకారం