Medigadda Barrage : రేపు మేడిగడ్డకు మంత్రి ఉత్తమ్

మేడిగడ్డ ఆనకట్టతో పాటు అన్నారం, సుందిళ్ల ఆనకట్టల వద్ద జరుగుతున్న తాత్కాలిక మరమ్మతులు, వర్షాకాలం కోసం రక్షణ చర్యలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • Written By:
  • Publish Date - June 6, 2024 / 01:34 PM IST

మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల ఆనకట్ట మరమ్మతులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షించనున్నారు. ఇందుకోసం రేపు మేడిగడ్డకు ఉత్తమ్ వెళ్లనున్నారు. డీఎస్​ఏ కమిటీ సిఫార్సుల మేరకు చేపడుతున్న చర్యల పురోగతిని తెలుసుకోబోతున్నారు. నీటిపారుదలశాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ అనిల్ కుమార్, ఇతర ఇంజినీర్లతో కలిసి పనులపై ఆరా తీయనున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

మూడు ఆనకట్టల నిర్మాణ సంస్థలైన ఎల్ అండ్ టీ, ఆఫ్కాన్స్, నవయుగ సంస్థల ఉన్నతస్థాయి ప్రతినిధులు కూడా సమావేశానికి హాజరు కావాలని మంత్రి కార్యాలయం ఆదేశాలు చేసింది.. మేడిగడ్డ ఆనకట్టతో పాటు అన్నారం, సుందిళ్ల ఆనకట్టల వద్ద జరుగుతున్న తాత్కాలిక మరమ్మతులు, వర్షాకాలం కోసం రక్షణ చర్యలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇంజfనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో మంత్రి సమీక్షిస్తారు.

ఇక కాళేశ్వరం ప్రాజెక్టు విచారణను జస్టిస్ పీసీ ఘోష్ స్పీడ్ పెంచారు. ఈ నెల 20 వరకు హైదరాబాద్‌లో జస్టిస్ పీసీ ఘోష్ విచారణ చేపట్టనున్నారు. కాళేశ్వరంపై ఈ నెలాఖరుకు జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఇవ్వనున్నారు. మేడిగడ్డ బ్యారేజీలో దెబ్బతిన్న ఏడో బ్లాక్ పరిధిలో నిపుణుల బృందం పరీక్షలను ఇప్పటికే ప్రారంభించింది. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ కమిటీ సూచనల మేరకు నిపుణులు పరీక్షలు చేసి బ్యారేజీపై పూర్తి నివేదిక ఇవ్వనున్నారు.

Read Also : Apollo Hospitals Chairman : ప్రమాదానికి గురైన ఉపాసన తాత