Minister Uttam Kumar Reddy Invite Tenders : మరమ్మతుల కోసం టెండర్లకు ఉత్తమ్ ఆహ్వానం..

Minister Uttam Kumar Reddy Invite Tenders For Repair : భారీ వర్షాలకు తెగిపోయిన చెరువుకట్టలు, కెనాల్స్ పునరుద్ధరణకు టెండర్లు పిలవాలని నీటిపారుదల శాఖాధికారులను ఆదేశించారు. అంతే కాదు శుక్రవారం ఉదయానికే ఆన్​లైన్​లో టెండర్లు అప్​డేట్ చేయాలని స్పష్టం చేశారు.

Published By: HashtagU Telugu Desk
New Ration Cards Uttam Kumar Reddy

Minister Uttam Kumar Reddy Invite Tenders For Repair : ఇటీవల తెలంగాణ (Telangana) లో కురిసిన భారీ వర్షాలకు(Heavy Rains) అపార నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. రోడ్లు , చెరువులు , వాగులు ఇలా అన్ని తెగిపోయి పోయి రవాణా వ్యవస్థ తో పాటు జనజీవనం కూడా స్థంభించింది. వర్షాలు , వరదలు తగ్గుముఖం పట్టడం తో వాటి మరమ్మతుల పనిలో తెలంగాణ సర్కార్ నిమగ్నమైంది.

శుక్రవారం ఉదయంకల్లా టెండర్లు అప్​డేట్

గురువారం హైదరాబాద్ జలసౌధలో ప్రాజెక్టులు, జలాశయాల్లో ప్రస్తుత పరిస్థితిపై ఈఎన్సీలు, చీఫ్ ఇంజినీర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy ) సమీక్ష నిర్వహించారు. వర్షాల వల్ల జరిగిన నష్టం, మరమ్మతులపై ఆరా తీశారు. ఏ సమస్య వచ్చినా పూర్తి బాధ్యత ఆ జిల్లా అధికారులదేనని, వరదలతో ఎంత నష్టం వాటిల్లిందో పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. భారీ వర్షాలకు తెగిపోయిన చెరువుకట్టలు, కెనాల్స్ పునరుద్ధరణకు టెండర్లు పిలవాలని (Invite Tenders For Repair of canals and tanks Damaged) నీటిపారుదల శాఖాధికారులను ఆదేశించారు. అంతే కాదు శుక్రవారం ఉదయానికే ఆన్​లైన్​లో టెండర్లు అప్​డేట్ చేయాలని స్పష్టం చేశారు.

మరోసారి ఇలాంటివి జరిగితే ఊరుకునేది లేదని ఉత్తమ్ హెచ్చరిక

ఇంతటి వర్షపు ఉధృతిలోనూ విధుల్లో నిమగ్నమయి పనిచేసిన నీటిపారుదల శాఖా సిబ్బందిని ఆయన అభినందించారు. అయితే అదే సమయంలో తాను స్వయంగా క్షేత్ర స్థాయిలో పర్యటించినప్పుడు కొన్ని వాస్తవాలు వెలుగు చుశాయన్నారు. రెగ్యులేటరీలు, షట్టర్లు పనిచేస్తున్నాయా లేదా అన్న పరిశీలన కనిపించలేదన్నారు. తద్వారా విపత్తులు సంభవించినప్పుడు దుష్పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని ..ఇలాంటివి రిపీట్ కావొద్దని హెచ్చరించారు. ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటే అందుకు సీఈలే బాధ్యత వహించాల్సి ఉంటుందని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు.

నిధులకు ఎలాంటి కొరత లేదు

ఎగువన ఉన్న గొలుసు కట్టు చెరువు తెగడంతో ఒక్కసారిగా ఆడిట్ ద్వారా వరదనీరు పంప్ హౌస్​లోకి చేరినట్లు ఇంజినీర్లు మంత్రికి వివరించారు. పంప్ హౌస్ నిర్మాణ సమయంలో ఆ తరహా జాగ్రత్తలు తీసుకోలేదా ముందస్తుగా అంచనా వేయలేదా అని మంత్రి ఉత్తమ్​కుమార్ రెడ్డి ఇంజినీర్లను అడిగారు. అకస్మాత్తుగా వచ్చిన వరద పంప్ హౌస్​ను ముంచెత్తిందని వివరించారు. పంప్ హౌస్​లోని నీటిని తోడే పని ప్రారంభమైందని, నెల రోజుల్లో మళ్లీ యథాతథ స్థితికి వస్తుందని తెలిపారు. ఈ మేరకు అన్ని అంశాలపై నివేదిక ఇవ్వాలని మంత్రి ఇంజినీర్లను ఆదేశించారు. తాత్కాలిక మరమ్మతులకు రూ.60 కోట్లు, శాశ్వత మరమ్మతులకు రూ.350 కోట్ల వరకు అవసరమవుతాయని ఇంజినీర్లు పేర్కొన్నారు. తాత్కాలిక మరమ్మతుల కోసం వెంటనే షార్ట్ టెండర్లు పిలవాలన్న మంత్రి, నిధులకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు.

Read Also : Mega Family Donation : రూ.9.4 కోట్ల ‘మెగా సాయం’ చేసిన మెగా హీరోస్..

  Last Updated: 05 Sep 2024, 10:39 PM IST