Site icon HashtagU Telugu

Gas Cylinder : త్వరలోనే రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ అందించబోతున్నాం – మంత్రి ఉత్తమ్

Uttam Gas

Uttam Gas

తెలంగాణ (Telangana) లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ (Congress Party)..ఎన్నికల హామీలను అమలు చేసే పనిలో నిమగ్నమైంది. ఇప్పటికే మహాలక్ష్మి , చేయూత పథకాలను అమలు చేసిన సీఎం రేవంత్ (CM revanth Reddy)..మిగతా హామీల ఫై ఫోకస్ చేసారు. చెప్పినట్లే 100 రోజుల్లో ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని చూస్తున్నారు. ఇప్పటీకే అధికారులను ముమ్మరం చేసారు. ఇదే విషయాన్నీ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar) తెలిపారు. తాజాగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ కార్యాలయంలో మంత్రి ఉత్తమ్..అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో సివిల్ సప్లయ్ శాఖ పని తీరును సమీక్షించిన ఆయన.. ధాన్యం కొనుగోలు, బియ్యం సేకరణ, గిడ్డంగుల నిర్వహణ, రేషన్ వస్తువుల సరఫరా తదితర అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సందర్బంగా ఉత్తమ్ మాట్లాడుతూ..తమ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో రెండింటిని ఇప్పటికే మొదలు పెట్టిందని, త్వరలోనే రూ. 500 గ్యాస్ సిలిండర్ అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. క్వాలిటీ రేషన్ సప్లై 5 కిలోల బియ్యం కేంద్రం ఇస్తుంది. రాష్ట్రం ఇచ్చే కిలో బియ్యం క్వాలిటీ పెరగాలి. ఇప్పటి వరకు ఒక కిలోనే ప్రతీ మనిషికి బిఆర్ఎస్ ఉచితంగా ఇచ్చింది. దీంతో లబ్ధిదారుల నుంచి పీడీఎస్ రైస్ డైవర్ట్ అయింది. లబ్ధిదారులకు తినగలిగే రైస్ ఇవ్వాలనేది మా తపన. దీనిపై కమిషనర్ మళ్ళీ సమీక్ష చేయాలి. మొత్తం రాష్ట్రంలో 2కోట్ల 80 లక్షల మంది లబ్ధిదారులున్నారు. ప్రోక్యూర్మెంట్ కు సివిల్ సప్లై అన్ని చర్యలు తీసుకోవాలి. అలాగే రైతులకు డబ్బులు వెంటనే అందే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. 11వేల కోట్ల నష్టాల్లో సివిల్ సప్లై కార్పొరేషన్ ఉందన్న ఆయన.. తొమ్మిదిన్నర ఏళ్ల బిఆర్ఎస్ పాలనలో లోపాలు ఉన్నాయని విమర్శించారు. ఇక కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రజల నుంచి డిమాండ్ వస్తోదని.. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

Read Also : Chief Security Officer : సీఎం రేవంత్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా గుమ్మి చక్రవర్తి