Site icon HashtagU Telugu

Talasani Teenmar: మంత్రి తలసాని స్టెప్పెస్తే..!

Talasani

Talasani

తెలంగాణలో బోనాల సందడి నెలకొంది. జోరు వర్షంలోనూ బోనాలను నిర్వహించుకుంటున్నారు ప్రజలు. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో బోనాలు ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నూతనంగా నిర్మించిన సికింద్రాబాద్‌ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయ ముఖ ద్వారాలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హోమంత్రి మహమూద్‌ అలీ, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని స్టెప్పులు వేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మహంకాళి దేవాలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. మంత్రి తలసాని కుటుంబ సభ్యులు ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి తొలి బోనాన్ని సమర్పించారు. ప్రస్తుతం మంత్రి తలసాని చేసిన డాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.