Munugode bypoll: మునుగోడులో ప్రతిపక్షాల డ్రామాలు మొదలయ్యాయి!

మునుగోడ్ ఉప ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించి ప్రతి పక్షాల అభ్యర్థులు డ్రామాలు ప్రారంభించారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

  • Written By:
  • Updated On - October 25, 2022 / 05:29 PM IST

మునుగోడ్ ఉప ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించి ప్రతి పక్షాల అభ్యర్థులు డ్రామాలు ప్రారంభించారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. మంగళవారం తెలంగాణ భవన్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, MLC లు ప్రభాకర్ రావు, ఎగ్గే మల్లేశం, MLA లు కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, షీప్ అండ్ గోట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, మాజీ MLC శ్రీనివాస్ రెడ్డి, TRS రాష్ట్ర నాయకులు క్యామ మల్లేశ్ లతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడులో ప్రతిపక్షాల డ్రామాలు స్టార్ట్ అయ్యాయని, తాను గత నాలుగైదు రోజుల నుండి చెబుతూ వస్తున్నానని, అదే నిజమైందని అన్నారు.

సానుభూతి కోసం చేతికి పట్టీలు, కాళ్ళకు కట్లు కట్టుకోవడం వంటివి దుబ్బాక హుజురాబాద్ లలో జరిగాయని, మునుగోడ్ లో కూడా అదే జరుగబోతుందని చెప్పారు. ఇవ్వాళ జ్వరం, రేపు దాడులు అంటూ ఏడుపులు డ్రామాలు చేస్తారని, మునుగోడ్ ప్రజలు వాటిని నమ్మి మిసపోవద్దని హెచ్చరించారు. ప్లోరైడ్ సమస్య తో అనేకమంది అంగవికలురుగా మారారని, మరికొంతమంది అనారోగ్యం పాలైనారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఫ్లోరెడ్ సమస్య పూర్తిగా పోయిందని చెప్పారు. రాజగోపాల్ రెడ్డి గెలిచినా ప్రజలకు ఎలాంటి మేలు ఉండబోదన్నారు. తన స్వప్రయోజనాల కోసమే రాజీనామా చేశారని ప్రజలు గట్టిగా నమ్ముతున్నారని అన్నారు. జనరల్ ఎన్నికల లోపు అభివృద్ధిలో మార్పు కనిపించకపోతే ప్రజలు అప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా స్వీకరిస్తాం. ఎన్నికల్లో గెలవాలనే ఆలోచనతో వాళ్లంతట వాళ్లే దాడులు చేయించుకొని దానిని ప్రభుత్వం పై నెట్టే ప్రయత్నం కూడా చేస్తారని చెప్పారు. ఒకవైపు రాజగోపాల్ రెడ్డికి జ్వరం వస్తే మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి ఏడుపుతో ప్రజల సానుభూతి ని పొందాలని యత్నిస్తున్నారని పేర్కొన్నారు. మునుగొడులో టీఆరెస్ స్పష్టమైన మెజారితో గెలుస్తోందన్నారు.

ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే మునుగొడులో ఉన్నా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అన్ని అందాయని తెలిపారు. బీజేపీకి మిగిలింది ఇక మూడు రోజులే..కాబట్టి సెంటిమెంట్ రగిలించడానికి అనేక డ్రామాలు ప్రయత్నాలు చేస్తున్నాయని అన్నారు. మేము కాంట్రాక్టర్ల కోసం రాజకీయం చేసే వాళ్ళం కాదని, కుట్రలు, కుతంత్రాలు మాకు అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి పై BJP నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతూ బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మునుగోడ్ లో గెలిపిస్తే వెయ్యి కోట్లు తీసుకొస్తామని రాజగోపాల్ రెడ్డి ఎక్కడి నుండి తీసుకొస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. 18 వేల కోట్ల నుండి తీసుకొస్తారా అని ఎద్దేవా చేశారు. ముందుగా గెలిచిన దుబ్బాక, హుజూరాబాద్ నియోజకవర్గాలకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. BJP నేతలు తమ స్థాయిని మరచి మాట్లాడుతున్నారని, తాము కూడా తిట్టగలమని ఘాటుగా హెచ్చరించారు.