Minister Sridhar Babu: మంత్రి శ్రీధర్ బాబు మంగళవారం ఆదిలాబాద్‌లో ముంపు గ్రామాల్లో పర్యటించారు. ఈ మేరకు మంత్రి నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రాణనష్టం సంభవించిన ప్రతి కుటుంబానికి రూ.5లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. పశువులను కోల్పోయిన వారికి రూ.50 వేలు అందజేస్తామన్నారు. ఊహించని ప్రకతి విపత్తుకు అందరి సహకారం అవసరం అని మంత్రి అన్నారు. పెనగంగాను పరిశీలించిన మంత్రి అధికారులకు తగిన సూచనలు చేశారు. ఓవైపు ముంపు గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రతిపక్షాలు విమర్షలు చేయడం సరికాదని ఫైర్ అయ్యారు. ప్రతిపక్ష పార్టీలు ఈ సమయంలో రాజకీయం చేయకుండా ప్రభుత్వానికి సహకరించాలన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
మరోవైపు ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురం, పండ్రేగుపల్లి గ్రామాలలో మున్నేరు వరద ముంపు ప్రాంతాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరిశీలించారు. న్యూ లక్ష్మీపురం గ్రామంలోని ఎస్సీ కాలనీలో వరద నీరు వచ్చిన ఇండ్లను పరిశీలించి వారికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ధైర్యం చెప్పారు. పండ్రేగుపల్లి లో మున్నేరు కరకట్ట తెగి ఇండ్లలోకి నీరు వచ్చిన డబుల్ బెడ్ రూమ్ కాలనీని సందర్శించారు. పండ్రేగుపల్లి లో వర్షాలకు దెబ్బతిని కూలిపోయిన వజీర్ పాషా రేకుల ఇంటిని పరిశీలించి బాధితులకు మనోధైర్యం చెప్పారు.
పండ్రేగుపల్లి లో కరకట్ట తెగి నీట మునిగిన పంట పొలాలను పరిశీలించి రైతులకు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. వరద ముంపు బాధితులకు తక్షణ సాయం కింద నిత్యవసర సరుకులను అందజేయాలని తహసిల్దార్ కరుణాకర్ రెడ్డిని ఆదేశించారు. క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రాథమికంగా పంట నష్టం అంచనాలు తయారుచేసి నివేదిక పంపాలని మండల వ్యవసాయ అధికారిని ఆదేశించారు.
Read Also: Telangana Floods : వరదల్లో చిక్కుకున్న 9 మంది చెంచు గిరిజనులను రక్షించిన పోలీసులు