Minister Sridhar Babu : మంత్రి శ్రీధర్ బాబు కు మరో కీలక పదవి దక్కింది

మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) కు మరో కీలక పదవి అప్పగించింది అధిష్టానం. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో నేషనల్ మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేస్తూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్​ కుమార్ గౌడ్ ఆదేశాలు ఇచ్చారు. నేషనల్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా మంత్రి శ్రీధర్ బాబు ను ఎంపిక చేసారు. ప్రస్తుతం కాంగ్రెస్ ఫోకస్ అంత లోక్ సభ ఎన్నికల ఫైనే దృష్టిసారించింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసిన కాంగ్రెస్..లోక్ సభ ఎన్నికల్లోనూ […]

Published By: HashtagU Telugu Desk
Minister Sridharbabu

Minister Sridharbabu

మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) కు మరో కీలక పదవి అప్పగించింది అధిష్టానం. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో నేషనల్ మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేస్తూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్​ కుమార్ గౌడ్ ఆదేశాలు ఇచ్చారు. నేషనల్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా మంత్రి శ్రీధర్ బాబు ను ఎంపిక చేసారు.

ప్రస్తుతం కాంగ్రెస్ ఫోకస్ అంత లోక్ సభ ఎన్నికల ఫైనే దృష్టిసారించింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసిన కాంగ్రెస్..లోక్ సభ ఎన్నికల్లోనూ క్లిన్ స్వీప్ చేయాలనీ చూస్తుంది. అందుకు తగ్గట్లే వ్యూహాలు రచిస్తోంది. కాంగ్రెస్ కు పోటీగా మరో పార్టీ లేకుండా చేయాలనీ రేవంత్ కసరత్తులు మొదలుపెట్టారు. తన ఆలోచనలను ఎప్పటికప్పుడు ఢిల్లీకి చేరవేస్తూ..నువ్వు ఏదంటే అది చేసేయ్ అనే తీరుగా కాంగ్రెస్ పెద్దల నుండి గ్రీన్ సిగ్నల్ తీసుకుంటూ తన దూకుడును మరింత పెంచుకుంటూ వెళ్తున్నారు. కాంగ్రెస్ గేట్లు ఓపెన్ చేసి..ఇతర పార్టీల నుండి వచ్చిన వారిని వచ్చినట్లు లోనికి ఆహ్వానిస్తూ..వారికీ కీలక పదవులు అప్పగిస్తూ అసలైన రాజకీయం అంటే ఎలా ఉంటుందో చూపిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

అందుకే లోక్ సభ ఎన్నికల్లో విజయం ఫై దృష్టి సారించి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా నేషనల్ మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేస్తూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్​ కుమార్ గౌడ్ ఆదేశాలు ఇచ్చారు. దీనికి చైర్మన్‌గా మంత్రి శ్రీధర్ బాబు, కన్వీనర్ గా ప్రోఫెసర్ అల్దాస్ జానయ్య, సభ్యులుగా శ్యాం మోహన్, కమలాకేరా రావు, బీఎం వినోద్ కుమార్, రియాజ్, జానక్ ప్రసాద్ లను నియమించారు. ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఏ విధంగా మేనిఫెస్టోను చేరవేయాలనేదానిపై అన్వేషించి పార్టీకి రిపోర్టు ఇస్తుంది. ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్తే పార్టీకి బెన్ ఫిట్ ఉంటుంది? కాంగ్రెస్ పార్టీకి ఎలా మద్దతు లభిస్తుంది? లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలిచేందుకు మేనిఫెస్టో ప్రభావం ఎంత వరకు ఉంటుంది? అనే తదితర అంశాలపై ఈ కమిటీ అధ్యయనం చేసి పదిహేను రోజుల్లో పార్టీకి నివేదికను సమర్పించనుంది.

Read Also : Kadiyam Kavya: వ‌రంగ‌ల్‌లో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్‌.. ఎంపీ ఎన్నిక‌ల నుంచి త‌ప్పుకున్న క‌డియం కావ్య‌

  Last Updated: 28 Mar 2024, 11:41 PM IST