Musi : మూసీ నది సుందరీకరణ కార్పొరేషన్ తెచ్చింది బీఆర్ఎస్సే – మంత్రి శ్రీధర్

Musi : మూసీలో అక్రమ కట్టడాలు గుర్తించాలని గతంలో కేసీఆర్‌ ఆదేశించలేదా అని ప్రశ్నించారు

Published By: HashtagU Telugu Desk
Musi Sridar

Musi Sridar

మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషను (Musi Riverfront Development Corporation) 2017లో ఏర్పాటు చేసింది గత BRS ప్రభుత్వమేనని మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) తెలిపారు. ‘మూసీకి ఇరువైపులా 50 మీటర్ల బఫర్ జోన్ను గుర్తిస్తూ జీవో జారీ చేశారు. 8,480 అక్రమ నిర్మాణాలను కూల్చేయాలని కేటీఆర్ 2021లో ఆదేశించారు. కానీ మాటలతోనే కాలం గడిపారని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు.

మంగళవారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. మూసీ ప్రక్షాళనపై విపక్షాలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీలో అక్రమ కట్టడాలు గుర్తించాలని గతంలో కేసీఆర్‌ ఆదేశించలేదా అని ప్రశ్నించారు. మూసీని కాలుష్య రహితంగా చేయాలని కేసీఆర్‌ చెప్పలేదా అని మండిపడ్డారు. గతంలో బీఆర్‌ఎస్‌ నేతలు చేసిన పనులు మర్చిపోయినట్లున్నారని సెటైర్లు వేశారు. బీఆర్‌ఎస్‌ హయాంలోనే మూసీకి సరిహద్దులను ఫిక్స్‌ చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు మూసీ ప్రక్షాళన ఎందుకని బీఆర్‌ఎస్‌ వాళ్లు ప్రశ్నిస్తున్నారని అన్నారు.

Read Also : Durga Chalisa: దుర్గా చాలీసాను పఠించ‌డం వ‌ల‌న క‌లిగే లాభాలివే..!

  Last Updated: 01 Oct 2024, 08:16 PM IST