వరంగల్ లో మిస్ వరల్డ్ కాంటెస్టెంట్(Miss World Contestants)ల సందర్శనపై బీఆర్‌ఎస్ (BRS) చేసిన విమర్శలకు మంత్రి సీతక్క (SIthakka) ఘాటుగా స్పందించారు. బీఆర్‌ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలలో భాగంగా రాష్ట్ర ఆడబిడ్డలతో మిస్ వరల్డ్ కాంటెస్టెంట్‌ల కాళ్లు కడిగించారన్న ఆరోపణలపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
Widowmaker Heart Attack: విడోమేకర్ హార్ట్ అటాక్ అంటే ఏమిటి? దీని లక్షణాలివే!
గుళ్లలోకి కాళ్లు కడుక్కొని వెళ్లడం గిరిజన సంప్రదాయం.. అదే అక్కడ పాటించారు. అందులో ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ అమ్మాయి సుందరీమణుల కాళ్లకు నీళ్లు పోసింది. దాన్ని పట్టుకుని తెలంగాణ ప్రభుత్వం చేసిందని బద్నాం చేస్తున్నారని, నిస్సిగ్గుగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కాళ్లు కడిగితే అందరి కాళ్లూ కడిగించాలి కదా?. ఇలాంటి విషయాలను ప్రభుత్వానికి అంటగట్టడం సిగ్గు అనిపించడం లేదా?. ఎమ్మెల్సీ కవిత తన కాళ్ల దగ్గర కలెక్టర్‌ను కూర్చోబెట్టుకోవడం, కలెక్టర్లతో కేసీఆర్ కాళ్లు మొక్కించుకోవడం దురహంకారం కాదా?. దానికి వ్యతిరేకంగానే కదా ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టింది. తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడే అర్హత మీకుందా..?” అంటూ సీతక్క నిప్పులు చెరిగారు.
ఇదే సందర్బంగా సబితా ఇంద్ర రెడ్డి ములుగు మీద పచ్చి అబద్ధాలు చెబుతున్నారని, ఆమె మంత్రిగా ఉన్నప్పుడు ఏం మానవత్వం చూపిందో తెలుసని.. అబద్ధాలు కాకుండా వాస్తవాలు మాట్లాడితే బాగుంటుందని సూచించారు.