Minister Sitakka : గవర్నర్‌తో మంత్రి సీతక్క భేటీ.. కీలక బిల్లులు ఆమోదించాలని విజ్ఞప్తి

Minister Sitakka: గవర్నర్‌తో భేటీ అనంతరం మంత్రి సీతక్క​ మీడియాతో మాట్లాడారు. 2022లో ములుగును మున్సిపాలిటీగా గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బిల్లుకు ఆమోదం తెలిపి గవర్నర్‌కు పంపింది.

Published By: HashtagU Telugu Desk
Minister Seethakka meet with the Governor.. Appealed to pass key bills

Minister Seethakka meet with the Governor.. Appealed to pass key bills

Minister Sitakka meet with the Governor: మంగళవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో మంత్రి సీతక్క భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇరువురు చర్చించారు. గవర్నర్‌తో భేటీ అనంతరం మంత్రి సీతక్క​ మీడియాతో మాట్లాడారు. 2022లో ములుగును మున్సిపాలిటీగా గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బిల్లుకు ఆమోదం తెలిపి గవర్నర్‌కు పంపింది. రెండు సంవత్సరాలుగా పెండింగ్‌లోనే ములుగు మున్సిపాలిటి అంశం ఉంది. ములుగు మున్సిపాలిటీ బిల్లుతో పాటు మరో ఐదు బిల్లుకు ఆమోదం తెలుపాలని ఈ సందర్భంగా గవర్నర్‌కు విజ్ఞప్తి చేశాం. అదిలాబాద్ అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళి విషయాన్ని తెలియజేసాం.

Read Also: Siddhivinayak Temple: సిద్ధివినాయక ప్రసాదంలో ఎలుక‌లు.. వీడియో వైర‌ల్‌..!

అదిలాబాద్, నాగర్ కర్నూల్ చెంచు ప్రాంతాల్లో పర్యటించాలని గవర్నర్‌ను కొరాం. గవర్నర్‌ ములుగులో ఓ గ్రామాన్ని దత్తత తీసుకునే ఆలోచనలో ఉన్నారు. దత్తత గ్రామాల లిస్ట్ గవర్నర్‌కు పంపాం, అదిలాబాద్ జిల్లా పర్యటనకు గవర్నర్ సానుకూలంగా స్పందించారు. ములుగు మున్సిపాలిటీ బిల్లు ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద ఉందని తెలిసింది. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాము” అని సీతక్క పేర్కొన్నారు.

కాగా, చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ బిల్లును ఆమోదించి ములుగును మున్సిపాలిటీగా మార్చాలని గవర్నర్‌కు తాజాగా మంత్రి సీతక్క విన్నవించారు. తన విజ్ఞప్తిపై గవర్నర్ సానుకూలంగా స్పందించారని మంత్రి తెలిపారు. అలాగే జైనూర్ ఘటనపై వివరాలను సైతం గవర్నర్ ఆరా తీశారని చెప్పారు. ఆదివాసీ ప్రజల సమస్యలు, ఇబ్బందులు తెలుసుకునేందుకు త్వరలో ఆదిలాబాద్,నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించాలని గవర్నర్‌ను కోరినట్లు సీతక్క తెలిపారు.

Read Also: Elections : రేపు జమ్మూకాశ్మీర్‌లో రెండో దశ ఎన్నికలు..పోలింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత

 

  Last Updated: 24 Sep 2024, 01:13 PM IST