ఇకపై దివ్యాంగులు (Disabled People) కంపెనీల చుట్టూ ఉద్యోగాల కోసం తిరగాల్సిన అవసరం లేదని, పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే అర్హత ప్రకారం ఉద్యోగాలు వస్తాయని తెలిపి వారిలో ఆనందం నింపారు మంత్రి సీతక్క (Minister Seethakka). తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి వరుస గుడ్ న్యూస్ లు అందజేస్తూ వస్తుంది.
ఈ క్రమంలో ప్రభుత్వం వికలాంగుల జాబ్ పోర్టల్ ను ఏర్పాటు చేయగా..ఈ జాబ్ పోర్టల్ (Job Portal For Disabled People) ను మంత్రి సీతక్క ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. ఉపాధి రంగాల్లో దివ్యాంగులకు అవకాశాలు తక్కువ అన్నారు. ఇతర వర్గాల వర్గాల వారిలా ఫైట్ చేయాలంటే ఎన్నో అవరోధాలు ఎదుర్కొవలసి ఉంటుందన్నారు. శారీరకంగా వచ్చే లోపం మన చేతిలో లేదని , పోషకాహార లోపం, ప్రమాదం వల్ల వికలాంగులుగా మారే ప్రమాదం వుందన్నారు. అందుకే వాళ్లకి ఉపాది అవకాశాలు కల్పించేందుకు ఆన్లైన్ జాబ్ పోర్టల్ ను ప్రారంభిస్తున్నామని తెలిపారు.
ప్రైవేటు ఉద్యోగాల్లో వికలాంగులకు రిజర్వేషన్లు పాటించాలని తెలిపారు. సంక్షేమ శాఖ నిధుల్లో దివ్యాంగులకు 5% కేటాయిస్తున్నామని, ప్రైవేట్ ఉద్యోగాల్లోనూ 4% రిజర్వేషన్లు ఇస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, ఇతర పథకాల్లో వారికి రిజర్వేషన్లు కల్పిస్తామని ఆమె హామీ ఇచ్చారు. దివ్యాంగుల పరికరాల కోసం బడ్జెట్‌లో రూ.50 కోట్లు వెచ్చించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మహిళ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, దివ్యాంగుల సహకార సంస్థ ఛైర్మన్ వీరయ్య, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ జేడీ శైలజ తదితరులు పాల్గొన్నారు.
Read Also : Rajamouli : ‘కల్కి’ మూవీ రాజమౌళి ఫొటోలు లీక్.. ఈ లుక్స్ లో రాజమౌళి విలన్ గా చేస్తే..