Site icon HashtagU Telugu

Seethakka : ఉచిత బస్సు కావాలా..? వద్దా..? చెప్పండి – సీతక్క

Sithakka

Sithakka

రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా నడుస్తున్నాయి. గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మానంపై చర్చ పరస్పర విమర్శలకు దారి తీసింది. ఆటోడ్రైవర్ల సమస్య అంశంపై కాంగ్రెస్‌ను బీఆర్ఎస్ టార్గెట్ చేసింది. దీనిపై మంత్రి సీతక్క (Seethakka ) ఆగ్రహం వ్యక్తం చేసారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం బిఆర్ఎస్ నేతలకు ఇష్టంలేదని, దాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు. ‘ఫ్రీ బస్సు కావాలా? వద్దా? చెప్పండి. బస్సుల్లో మహిళలు ఉచితంగా తిరిగితే మీకేం ఇబ్బంది. భావోద్వేగాలు రెచ్చగొట్టడమే బిఆర్ఎస్ నేతల నైజం’ అని అసెంబ్లీలో సీతక్క విమర్శించారు.

We’re now on WhatsApp. Click to Join.

హరీష్ రావు (Harish Rao)ను ఉద్దేశిస్తూ మీకు అగ్గిపుల్ల దొరకలేదు.. వందల మంది పిల్లలు చనిపోయారన్నారు. పొన్నం ప్రభాకర్ ప్రభాకర్ సైతం హరీష్ రావుపై విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో ఆటో డ్రైవర్లకు సాయం చేశారా అని ప్రశ్నించారు. ఉచిత బస్సు టికెట్లకు తమ ప్రభుత్వం రూ.530 కోట్లు వెచ్చించిందన్నారు. పదేళ్లలో ఆటో డ్రైవర్లకు నెలకు రూ. వెయ్యి అయినా ఇచ్చారా? అని పొన్నం ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికులు 60 రోజులు సమ్మె చేసినా పట్టించుకోలేదన్నారు.

అసెంబ్లీకి శాసనసభ్యులు ఆటోలో వెళ్లకూడదా అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు ప్రశ్నించారు. ‘అసెంబ్లీ సాక్షిగా నేడు ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యింది. ప్రజా ప్రభుత్వంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు లేదా? ఇదేనా ప్రజాపాలన? ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ప్రభుత్వం వెంటనే వారికి పరిష్కారం చూపాలి. ఆటో కార్మికులకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది’ అని ట్వీట్ చేశారు.

Read Also : Vemula Veeresam : పడగొట్టడానికి, కూలగొట్టడానికి గోడలు కావు.. ఇది ప్రజాప్రభుత్వం – ఎమ్మెల్యే వేముల వీరేశం