Minister Seethakka : కేటీఆర్ ‘శునకము’ ట్వీట్ కు మంత్రి సీతక్క కౌంటర్..

  • Written By:
  • Publish Date - January 26, 2024 / 04:48 PM IST

పార్లమెంట్ ఎన్నికలు (Lok Sabha Elections) సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ (Telangana) లో కాంగ్రెస్ vs బిఆర్ఎస్ (Congress Vs BRS) వార్ మొదలైంది. ఇరు పార్టీల నేతలు మాటల యుద్ధం చేస్తున్నారు. పబ్లిక్ వేదికలతో పాటు సోషల్ మీడియా వేదికల ఫై కూడా తారాస్థాయి లో మాటలు వదులుతున్నారు. నేడు రిపబ్లిక్ డే (Republic Day) నాడు కూడా ఇరువురు కౌంటర్లు వేసుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

మాజీ మంత్రి , బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ (KTR)..ట్విట్టర్ వేదికగా ‘పెద్దవాళ్లు ఎప్పుడో చెప్పారు’ అనే క్యాప్షన్ పెట్టి.. సుమతి శతకంలో బద్దెన రాసిన ‘కనకపు సింహాసనమున శునకమును గూర్చుండబెట్టిన శుభ లగ్నమునం దొనరగ బట్టము గట్టిన వెనుకటి గుణ మేలమాను? వినురా సుమతీ’ అనే పద్యాన్ని షేర్ చేశారు. అయితే, ఇందులో ఎవరి పేరును ప్రస్తావించినప్పటికీ.. ఈ ట్వీట్ సీఎం రేవంత్ రెడ్డి ని ఉద్దేశించే పోస్ట్ చేసాడని కాంగ్రెస్ శ్రేణులు మాట్లాడుకుంటున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి గురువారం బూత్ లెవల్ కన్వీనర్ల సదస్సులో చేసిన కామెంట్స్ కు కౌంటర్ గానే ఇలా పోస్ట్ చేసినట్లు నెట్టింట సైతం చర్చ సాగుతోంది. ఈ తరుణంలో మంత్రి సీతక్క (Seethakka) కేటీఆర్ కు కౌంటర్ వేశారు. ‘నీ ప్రతి మాటా దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంటుంది. అహంకారానికి బ్రాండ్ అంబాసిడరే మీ కుటుంబం. అందుకే తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెప్పారు. ‘దొర’ హంకారానికి ప్రతిరూపం మీ పాలన. ప్రజాపాలనకి నిలువెత్తు నిదర్శనం మా పాలన’ అని మంత్రి సీతక్క ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇరువురి ట్వీట్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

Read Also : AP News: లోక్ సభ బరిలో మాజీ మంత్రి అనిల్, ఆ స్థానం నుంచి పోటీ?