Minister Seethakka: మంత్రి సీతక్క (Minister Seethakka) గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేసింది. అలాగే మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చింది. మీడియా సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ.. గత పదేళ్లలో గ్రామ పంచాయతీలలకు గత ప్రభుత్వం 10,170 కోట్లను కేటాయించింది. కానీ అందులో కేవలం రూ. 5988 కోట్లనే విడుదల చేసింది. మిగిలిన రూ. 4181 కోట్లను పెండింగ్ లోనే పెట్టింది. అంటే 44 శాతం నిధులను గ్రామ పంచాయతీలకు ఇవ్వకుండా తన సొంత అవసరాలకు గతప్రభుత్వం వాడుకుంది. దీంతో గ్రామ పంచాయతీల్లో అభివృద్ది కుంటుపడింది. జీపీలకు ఇచ్చే నిధులను ఇవ్వని గత ప్రభుత్వానికి..ఇప్పుడ మాట్లాడే హక్కు ఎక్కడిది? అని ప్రశ్నించింది.
గ్రామాల్లో మౌళిక సదుపాయల కల్పన, ఆర్దిక అవకాశాలను మెరుగు పరిచేందుకు ఉద్దేశించిన నేషనల్ రర్బన్ (రూరల్ అర్బన్ మిషన్) పథకానికి సంబంధించి 2019 నుంచి బీఆర్ఎస్ అధికారం పోయేనాటికి రూ. 1200 కోట్ల బిల్లులను గత ప్రభుత్వం చెల్లించకుండా పెండింగ్ లో పెట్టింది. ప్రభుత్వం కంటిన్యూయస్ ప్రాసెస్ అయినా ఆరు నెలలో ఏడాదో బిల్లులు పెండింగ్ పెడుతారు. కానీ ఐదేండ్లు బిల్లులను పెండింగ్ లో పెట్టడం ఏంటీ? అని ప్రశ్నించారు.
Also Read: Raksha Bandhan 2024: రక్షా బంధన్ ఎప్పుడు..? ఏ సమయంలో రాఖీ కట్టాలంటే..?
స్టేట్ స్వచ్చ భారత్ మిషన్ కింద చేయించిన పనులకు సంబంధించి రూ. 940 కోట్ల బిల్లులు గత ఆరేండ్లుగా పెండింగ్ లో ఉన్నాయన్నారు. రూరల్ ఇంజనీరింగ్ డిపార్ట్ మెంట్ లో రూ. 600 కోట్ల బిల్లులను గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిందని తెలిపారు. అసలే పంచాయితీలకు ఆదాయ వనరులు అంతంత మాత్రమే. 2018 నూతన పంచాయతీ చట్టం ద్వారా అడ్వర్టైజింగ్, మైనింగ్, అక్ట్రాయ్ పన్నులను గత ప్రభుత్వం పంచాయతీలకు లేకుండా చేసింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం తీసుకోచ్చిన జీఎస్టీ పన్నుల విధానంలో పంచాయితీలు చాలా ఆదాయ మార్గాలను కోల్పోయాయి. పైగా ఆదుకోవాల్సిన గత ప్రభుత్వం..నిర్లక్షంగా వ్యవహరించిందని విమర్శలు చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
హరీష్ రావు పదే పదే అబద్దాలు చెబితే ప్రజలు నమ్మరు. మీ హయంలోనే సర్పంచ్ లు ఆత్మహత్యలు చేసకున్నారు. మర్చిపోయారా? అని కౌంటర్ ఇచ్చారు. వర్షాకాలం అయిపోయాక కేసీఆర్ జన్మదినం కోసం ఫిబ్రవరి లో మొక్కలు పెట్టించిన చరిత్ర మీది. హరిత హరం పేరుతో అర్బాటాలు చేసింది మీరు? అని మండిపడ్డారు. రికార్డు స్థాయిలో స్వచ్ఛదనం – పచ్చదనం పనులు జరుగుతున్న విషయం మీకు తెలియడం లేదా? మూడు రోజుల్లోనే 25 లక్షల మొక్కలు నాటినం..29 వేల కిలోమీటర్ల రహదారులు, 18 వేల కిలోమీటర్లకు పైగా డ్రైనేజీ కాలువలను శుబ్రపరిచినం..మీకు కనిపించడ లేదా? అని ప్రశ్నించారు.