ఖమ్మం(Khammam)లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్(Puvvada Ajay Kumar) నేడు డ్రైవింగ్ లైసెన్స్(Driving License) పై స్పెషల్ కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల ఖమ్మంలో దాదాపు 10000 మంది లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతున్నారని పోలీసులు తెలపడంతో ఖమ్మం నియోజకవర్గంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరికి ఉచిత లెర్నింగ్ లైసెన్స్ పంపిణీ చేయడం మొదలుపెట్టారు. మంత్రి క్యాంప్ కార్యాలయం లో ఈ నెల 7వ తేదీన స్లాట్ బుక్ చేసుకున్న 140 మంది యువతీ యువకులకు లెర్నింగ్ లైసెన్స్(Learning License) లను నేడు మంత్రి వారికి అందచేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. కేవలం ఒక్కరోజు నుండి రెండు రోజులలో లైసెన్స్ ఇస్తారు. ప్రతీ ఒక్కరు పర్మినెంట్ లైసెన్స్ హోల్డర్స్ అయితే మీకు మీ వాహనాలకు సెక్యూరిటీ ఉంటుంది. లైసెన్స్ ఉంటే ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. లెర్నింగ్ లైసెన్స్ తీసుకున్న ప్రతీ ఒక్కరు 30 రోజుల తరువాత పర్మినెంట్ లైసెన్స్ తీసుకోవాలి. నేను రవాణా శాఖ మంత్రిగా ఇంత మందిని మోటివేట్ చేయటం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఎన్ని మంచి పనులు చేసినా లైసెన్స్ ఇప్పించే కార్యక్రమం నాకు సంతృప్తినిచ్చింది అని అన్నారు.
ఇక ఇదే కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన పొంగులేటిపై విమర్శలు చేశారు. ఖమ్మంలో ఎవరెంత ట్రై చేసినా ఈసారి కూడా BRS వస్తుందని అన్నారు. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తే మాత్రం సీరియస్ గా తీసుకుంటానని వ్యాహ్యానించారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.
Also Read : Modi Cabinet : కేంద్ర మంత్రివర్గంలో `బండి` పక్కా! జీవిఎల్ కు చిగురాశ!!