Site icon HashtagU Telugu

Puvvada : ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయం!

Puvvada

Puvvada

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని మంత్రి పువ్వాడ అజయ్ ధీమా వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో పార్టీ గెలుపునకు కృషి చేసిన వారందరికీ మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక సంస్థలకు నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందని అన్నారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఖమ్మం టీఆర్‌ఎస్ అభ్యర్థి తాతా మధు ఈ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలుస్తారన్నారు. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు ప్రభుత్వం కూడా వ్యతిరేకమని ఆయన అన్నారు. రైతులకు, ప్రజలకు వ్యతిరేకంగా ప్రభుత్వం అనుసరిస్తున్న అన్ని విధానాలను వ్యతిరేకిస్తామని ఆయన చెప్పారు.

క్యాంపు రాజకీయాలకు తెరలేపిన స్థానిక సంస్థల కోటా MLC ఎన్నికలు ముగిశాయి. 5 జిల్లాల్లోని ఆరు స్థానాలకు పోలింగ్ జరిగింది. దాదాపు అన్ని చోట్ల 90 శాతానికిపైగా ఓటింగ్ నమోదైంది..ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం, మొదక్ జిల్లాల్లో ఒక్కో స్థానం..కరీంనగర్‌లో రెండు స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. మొత్తం ఓటర్లు 5 వేల 326 మంది. ఐదు జిల్లాల్లో ఏర్పాటు చేసిన 37 పోలింగ్ కేంద్రాల్లోనూ వెబ్‌ కాస్టింగ్‌, వీడియోగ్రఫీ ద్వారా ఓటింగ్ ప్రక్రియ మొత్తం రికార్డు చేశారు.  14న ఫలితాలు ప్రకటిస్తారు.

Exit mobile version