Site icon HashtagU Telugu

BRS vs BJP : కేసీఆర్‌పై మోడీ వ్యాఖ్య‌ల‌కు మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి కౌంట‌ర్‌.. “నీ బోడి స‌హాయం మాకు ఎందుకు” అంటూ ఘాటు వ్యాఖ్య‌లు

Kcr Vs Modi

Kcr Vs Modi

నిజామాబాద్ సభలో సీఎం కేసిఆర్‌ పై ప్రధాని మోడీ నిరాధార ఆరోపణలు చేయడం అత్యంత దుర్మార్గమని మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి అన్నారు. ప్రధాని స్థాయి వ్యక్తి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పచ్చి అబద్ధాలు మాట్లాడడం అత్యంత హేయనీయమ‌న్నారు. కేసిఆర్ ఎన్డీయేలో కలుస్తానని చెప్పడం పచ్చి అబద్దమ‌ని.. ఎన్డీయే లో కలవమని మీరు బ్రతిమిలాడితే దేశాన్ని అమ్మే వారితో కలవమని కేసీఆర్ ఖరాఖండిగా తేల్చి చెప్పార‌ని ప్ర‌శాంత్ రెడ్డి గుర్తు చేశారు. కేసీఆర్ పై ఎన్నికల వేళ అవినీతి ఆరోపణలు చేస్తున్న ప్ర‌ధాని మోడీ ఇన్ని రోజులు ఏం చేశార‌ని ప్ర‌శ్నిచారు. దర్యాప్తు సంస్థలన్నీ బీజేపీ జేబులోనే ఉన్నాయని ఆయ‌న ఆరోపించారు. ప్రపంచంలోనే అత్యంత అవినీతి పరుడైన ప్రధాని నరేంద్ర మోడీ కేసీఆర్‌పై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉంద‌న్నారు. అదానికి బినామీ మోడీ అంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

దేశ సంపదను తన మిత్రుడు అధానికి ప్ర‌ధాని మోడీ దోచిపెడుతున్నార‌ని ఆరోపించారు. హిండెన్ బర్గ్ లాంటి అంతర్జాతీయ సంస్థలు మోడీ అవినీతి చిట్టా బయటపెట్టాయని.. తన మిత్ర కార్పొరేట్లకు 12 లక్షల కోట్ల బ్యాంకు రుణాలు మాఫీ చేసి, ఆ అక్రమ డబ్బుతో ఎమ్మెల్యేలను కొంటూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ప్ర‌శాంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ అంటేనే నరనరాన విషం నింపుకున్న మోడీ తెలంగాణ కోసం చేసింది శూన్యమ‌న్నారు. బయ్యారం ఉక్కు కర్మాగారం,రైల్వే కోచ్ ఫ్యాక్టరీ,మెడికల్ కాలేజీలు,నవోదయ పాఠశాలలు,ఐటిఐఆర్,ఐఐటి లు ఒక్కటి కూడా తెలంగాణ కు ఇవ్వలేదన్నారు.. తెలంగాణ అభివృద్ది బద్ద వ్యతిరేకి మోడీ అని తెలిపారు. నిజామాబాద్ లో హెలికాప్టర్ దిగిన మోడీ.. కేసీఆర్ కట్టిన కలెక్టరేట్,కేటీఆర్ కట్టిన ఐటి టవర్ చూసి కన్నుకుట్టి కేసీఆర్,కేటీఆర్‌ల‌పై ఏవేవో కహానీలు చెప్పార‌న్నారు. ప్ర‌ధాని మోడీ పచ్చి అబద్దాల కోరు అని మరోసారి నిరూపించుకున్నార‌ని తెలిపారు.

Also Read:  Chandrababu CM : ఏపీలో అధికారం టీడీపీదే.! ఆత్మ‌సాక్షి లేటెస్ట్ స‌ర్వే వెల్ల‌డి!!

కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయాలంటే నీ సహాయం ఎందుకు..? నీవు ఎవడివి కౌన్ కిస్కాగాడివి నీ ఎమ్మెల్యేల సంఖ్య ఎంత.? నీ బలమెంత.? వందమంది ఎమ్మేల్యేలు బలం ఉన్నది మాకు అంటూ ఘాటుగా కౌంట‌ర్ ఇచ్చారు. కేసిఆర్ అనుకుంటే ఎమ్మెల్యేల సంఖ్యా బలంతో, కేటీఆర్‌ని ముఖ్యమంత్రిని చేయొచ్చని… ఇందులో నీ బోడి సహాయం ఎవడికి కావాలంటూ మండిప‌డ్డారు.. “అబ్ కి బార్ కిసాన్ సర్కార్” నినాదం మోడీ గుండెల్లో దడపుట్టిస్తోందని.. అందుకే సీఎం కేసీఆర్‌పై నిరాధార ఆరోపణలకు ప్ర‌ధాని మోడీ ఒడిగట్టార‌ని ఆరోపించారు. ఎన్ని కుట్ర‌లు చేసిన బీఆర్ఎస్ గెలుపుని ఆప‌లేరిన ప్ర‌శాంత్ రెడ్డి తెలిపారు.