Site icon HashtagU Telugu

Minister Ponnam Prabhakar : మంత్రి పొన్నం వీడియో సందేశం..

Minister Ponnam

Minister Ponnam

దసరా సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) ఓ వీడియో సందేశాన్ని పోస్ట్ చేసారు. ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలు (Accidents) ఏ విధంగా జరుగుతున్నాయో..చూస్తూనే ఉన్నాం. ఇంటి నుండి బయటకు వెళ్లిన వ్యక్తితిరిగి వచ్చేవరకు నమ్మకం లేదు. అతివేగం , మద్యం మత్తు , నిద్ర మత్తు , నిర్లక్షపు డ్రైవింగ్ ఇలా ఒకటి ఏంటి ఎన్నో కారణాలతో రోడ్డు ప్రమాదాలు అనేకం జరుగుతున్నాయి. ముఖ్యంగా సీటు బెల్ట్ ,హెల్మెట్ పెట్టుకోకపోవడం తో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ రెండు ఉన్న ప్రమాదం జరిగితే ప్రాణాలతో బయటపడొచ్చు. కొంతమంది లెక్కపెట్టుకోకపోతే..మరికొంతమంది ఉన్న కానీ పెట్టుకోరు. దీనివల్ల ప్రమాదం జరిగితే ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు హెల్మెట్ (Helmet) పెట్టుకోవాలి , సీటు బెల్ట్ (Seat belt) ధరించాలని చెపుతుంటారు.

తాజాగా ఇదే విషయాన్నీ మంత్రి పొన్నం తెలిపారు. బతుకమ్మ, దసరా ఫెస్టివల్ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెబుతూ చిన్న వీడియో సందేశం ఇచ్చారు. దేశవ్యాప్తంగా సగటున ఏడాదికి లక్షా 60 వేల మంది రోడ్డు ప్రమాదాల్లో మ‌ర‌ణిస్తున్నారు. కేవలం తెలంగాణలో సగటున రోజుకు 20 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ద‌స‌రా రోజు కుటుంబ సభ్యులందరం ఆయుధ పూజ చేసే సమయంలో ఒక ప్రతిజ్ఞ చేయాలని పిలుపు నిచ్చారు మంత్రి పొన్నం. ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం.. హెల్మెట్, సీటు బెల్టు పెట్టుకుందాం. దయచేసి మద్యం తాగి వాహనం నడపొద్దు.. అది ప్రమాదానికి సూచిక చెప్పుకొచ్చారు.

Read Also : Mukesh Ambani: మళ్లీ ఫోర్బ్స్ జాబితాలో టాప్ ప్లేస్‌లోకి వచ్చేసిన ముఖేష్ అంబానీ