Minister Ponnam : కేసీఆర్‌ను కలిసిన మంత్రి పొన్నం ప్రభాకర్

Minister Ponnam Prabhakar : ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో కలిశారు. తెలంగాణ సచివాలయం ప్రాంగణంలో జరగనున్న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి కేసీఆర్ ను మంత్రి పొన్నం ఆహ్వానించారు

Published By: HashtagU Telugu Desk
Ponnam Kcr

Ponnam Kcr

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌(KCR)ను మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) శనివారం ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో కలిశారు. తెలంగాణ సచివాలయం ప్రాంగణంలో జరగనున్న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ (Telangana Talli Statue Unveil) కార్యక్రమానికి కేసీఆర్ ను మంత్రి పొన్నం ఆహ్వానించారు. ఈ నెల 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్, ఇతర ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్టు మంత్రులు తెలిపారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.

ఇదే సమయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు కూడా ఆహ్వానం అందించనున్నారు. అన్ని వర్గాలకు చెందిన నేతల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేయాలన్నది ప్రభుత్వ సంకల్పంగా కనిపిస్తోంది. ఈ కార్యక్రమం రాష్ట్ర భవిష్యత్తులో చారిత్రకంగా నిలుస్తుందని మంత్రులు చెపుతున్నారు.

ఇదిలా ఉంటె..

తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ అంశంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎల్లుండి జరగనున్న విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ జూలూరి గౌరీశంకర్ ఆ పిటిషన్‌లో హైకోర్టును కోరారు. తెలంగాణ తల్లి విగ్రహం రూపు మార్చడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ… విగ్రహం రూపు మార్చడం ద్వారా తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాలను కూడా మార్చకుండా చూడాలని కోరారు.

Read Also : World Billionaires 2024 : భారత్‌లో 185 మంది బిలియనీర్లు.. వీరిలో 108 మంది ఎవరంటే ?

  Last Updated: 07 Dec 2024, 04:08 PM IST