Site icon HashtagU Telugu

Telangana: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకి షాక్ ఇచ్చిన మంత్రి.. లీగల్ నోటీసులు జారీ

Telangana

Telangana

Telangana: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి చేసిన ఆరోపణలపై మంత్రి పొన్నం ఘాటుగా రియాక్ట్ అయ్యారు. దీంతో కౌశిక్ రెడ్డికి నోటీసులు పంపారు. నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌టీపీసీ) రామగుండంలో ఫ్లై యాష్‌ కుంభకోణంలో రూ. 100 కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపించినందుకు గానూ హుజూరాబాద్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి సహా ఏడుగురికి తెలంగాణ రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ లీగల్‌ నోటీసులు పంపారు. ఈ అంశంపై కౌశిక్ రెడ్డితో పాటు టీ న్యూస్ ఎండీ సంతోష్ కుమార్, నమస్తే తెలంగాణ ఎడిటర్ తీగుళ్ల కృష్ణమూర్తి, తెలంగాణ పబ్లికేషన్ ప్రైవేట్ లిమిటెడ్, తెలంగాణ బ్రాడ్‌కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌లకు పరువు నష్టం నోటీసు అందజేసింది.

మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఎన్‌టీపీసీ రామగుండం నుంచి రోజూ అక్రమంగా ఫ్లై యాష్‌ రవాణా చేస్తూ రూ.50 లక్షలు తీసుకుంటున్నారని ఆరోపించారు హుజూరాబాద్‌ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. పొన్నం ప్రభాకర్ మేనల్లుడు అనుప్ డబ్బు వసూలు చేస్తున్నాడని ఆరోపించారు. తాను 13 ట్రక్కులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నానని, అయితే రవాణా శాఖ రెండు ట్రక్కులను సీజ్ చేసిందని, మంత్రి ఫోన్ చేసిన తర్వాత మిగిలిన వాటిని విడుదల చేశారని కౌశిక్ ఆరోపించారు.

Also Read: NEET 2024: సీబీఐపై నమ్మకం లేదు.. నీట్ మళ్ళీ నిర్వహించాల్సిందే: స్టూడెంట్స్