Site icon HashtagU Telugu

Minister Ponnam: మ‌హారాష్ట్ర‌లో త‌న‌దైన శైలిలో అద‌ర‌గొట్టిన మంత్రి పొన్నం

Minister Ponnam

Minister Ponnam

Minister Ponnam: మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా బల్హర్షా, చంద్రపూర్, రాజుర నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam) పాల్గొన్నారు. రాజుర కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ కూటమిని గెలిపించాల్సిన అవసరం ఎంతగానో ఉందని ఆయ‌న అన్నారు. ఈ కీలకమైన సందర్భంలో ఒక దిశను చూపే అద్భుతమైన అవకాశం మీకు వచ్చిందన్నారు. ఈ దేశాన్ని రక్షించుకోవడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి రాహుల్ గాంధీకి భారత్ జోడో యాత్ర ఆలోచన వచ్చిందన్నారు.

ప్రజల ఆకాంక్షల మేరకు మేమెంతో మాకు అంత అని రాహుల్ గాంధీ ఆశయాలను నిజం చేసేందుకు నడుం బిగించారని అన్నారు. చాలా వర్గాలకు సరైన ప్రాతినిధ్యం దక్కడం లేదన్న ఆశయాన్ని నిజం చేసేందుకు రాహుల్ గాంధీ నడుం బిగించారని మంత్రి తెలిపారు. చాలా వర్గాలకు ప్రాతినిధ్యం దక్కడం లేదనే కుల గణన నిర్ణయం తీసుకున్నట్లు వివ‌రించారు. దురదృష్టవశాత్తు గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాలేదు అయినా మేము అధైర్యపడం వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అధికారంలోకి వస్తుందన్నారు.

Also Read: Emojis Vs Marks : మార్కులకు గుడ్‌బై.. స్టార్లు, ఎమోజీలకు జైజై.. స్కూళ్లలో కొత్త ట్రెండ్

దేశవ్యాప్తంగా కులగ‌ణ‌న చేసి తీరుతామ‌న్నారు.కుల‌గ‌ణ‌న చేస్తే తన్ని తరమండి అని నితిన్ గడ్క‌రి అహంకారపూరిత మాటలు మాట్లాడుతున్నారని మండిప‌డ్డారు. భవిష్యత్తులో బీజేపీ నేతలకు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నేతలు ఏకమైతే వీళ్లకు పుట్టగతులు ఉండవని ఆగ్ర‌హించారు. బీజేపీని ఓడించండి దేశాన్ని రక్షించండి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని మంత్రి పిలుపునిచ్చారు.

ఇదే ప్రతి ఒక్కరి నినాదం కావాలని, గత ఎన్నికల్లో 400 సీట్లు గెలిపించాలని బీజేపీ నేతలు కోరిన విష‌యాన్ని గుర్తుచేశారు. ఎన్నిక‌ల్లో 400 సీట్లు గెలిపించి ఉంటే రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చి వేసేవారని విమ‌ర్శించారు. కనీసం భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా చేసేవారని దుయ్య‌బ‌ట్టారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చి పెట్టిన కాంగ్రెస్ బావ ప్రకటన స్వేచ్ఛను గౌరవిస్తుందని తెలిపారు. స్వేచ్ఛ తాను కోరుకునే విధంగా జీవించే హక్కును కాంగ్రెస్ ప్రభుత్వాలు కల్పించాయని, మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టిందన్నారు.

హిందుత్వం పేరుతో ఎన్నికల కోసం వర్గాల మధ్య కులాల మధ్య మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతుందని, బల్లార్షా, చంద్రాపూర్ ప్రాంతాల్లో భారీ పరిశ్రమలు కాంగ్రెస్ చలువేన‌ని తెలిపారు. బల్లార్షా పేపర్ ఫ్యాక్టరీ చంద్రపూర్ సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మించి జాతికి అంకితం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. కాంగ్రెస్ మాటంటే మాటే అని మాట ఇస్తే కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుంటుందని మంత్రి పేర్కొన్నారు.